Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : శెట్టిపేట పంచాయతీలో యం.యల్.ఆర్ ఇన్ఫ్రాటెక్ కంపెనీ అధినేత మాదిరాజు పతిరాజు సహకారంతో శెట్టిపేట పంచాయతీలోని పలు పాఠశాలలకు పుస్తకాలు విద్యాసామాగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆ కంపెనీ ప్రతినిధి ప్రదీప్ రాజు మాట్లాడుతూ విద్యార్థులకు విద్యాసామాగ్రి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. శెట్టిపేట హై స్కూల్ ఎంపీపీ స్కూల్ అంగన్వాడీ కేంద్రం పందిళ్ళ పల్లె,చుక్క వారి పల్లె ప్రైమరీ స్కూళ్లలో విద్యార్థులకు విద్యాసామాగ్రి పంపిణీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో వెంకటరమణ, సుధాకర్, ప్రవీణ్ కుమార్, రాఘవేంద్ర, రాజు కుమార్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
Admin
Famous TV