Sunday, 26 July 2026 04:50:41 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

చిట్టత్తూరు కాళేపల్లిలో వైసీపీ సర్పంచ్ టిడిపి పార్టీలో చేరిక

వైసీపీ పతనం ఆరంభమైంది ‌‌.. పులివర్తి నాని

Date : 03 March 2024 06:21 PM Views : 699

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : రామచంద్రాపురం మండలం, చిట్టత్తూరు కాళేపల్లి వైసీపీకి చెందిన సర్పంచ్ చిరంజీవి రెడ్డి తన అనుచరులతో కలిసి పులివర్తి నాని ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ నిరంకుశ విధానాలు, గ్రామ సమస్యలు పట్టించుకోకపోవడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడామన్నారు. ఏళ్ల తరబడి వేధిస్తున్న రాయలచెరువు సమస్య పరిష్కారించ లేదని వాపోయారు. చెరువు కలుషితమై గ్రామస్తులు రోగాలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ఎంపీపీ దగ్గర బంధువు చనిపోయిన పట్టించుకోలేదని ఆరోపించారు. చివరికి పట్టా భూముల్లో తుడా రోడ్లు వేశారని చర్యలు తీసుకోమన్నా స్పందించలేదని మండిపడ్డారు. మాట్లాడే స్వేచ్ఛ లేదు.. ప్రశ్నించే హక్కు లేదు.. నిలదీసే గొంతు లేకుండా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేస్తున్నారని విమర్శించారు. బానిస సంకెళ్లు విముక్తి.. పులివర్తి నాని గెలుపు తోనే సాధ్యమని సర్పంచ్ చిరంజీవి స్పష్టం చేశారు. అనంతరం పులివర్తి నాని మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ విధానాలు నచ్చి పార్టీలోకి వస్తున్న సర్పంచ్ చిరంజీవి రెడ్డి కి ఆయన వర్గీయులకు స్వాగతం పలికారు. గత ఎన్నికల్లో రాయలచెరువును అభివృద్ధి చేస్తానని చెప్పాను‌. ఓడి పోయి చేయలేక పోయాను. రాయలచెరువు ను ప్రాజెక్టు గా తీర్చిదిద్దుతాను. ఎవరికి అన్యాయం జరగకుండా చూస్తా.. అనుపల్లిలో 150 ఎకరాలు తీసుకుని కెమికల్ ఫ్యాక్టరీ పెట్టాలని చూస్తున్నారు. వైజాగ్ లోని కెమికల్ ఫ్యాక్టరీ లో పేలుడు సంభవించి ఏవిధంగా నష్టం సంభవించిందో అలా జరగవచ్చున్నారు‌. అలాగే తలకోనతో పాటు రాయలచెరువును పర్యాటక కేంద్రంగా తయారు చేస్తానని అన్నారు. రామచంద్రాపురంను అభివృద్ధి పరిచే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. అలాగే తిరుపతి నుంచి ఆర్సీ పురంకు 150 అడుగుల రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. అందరి సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళుతానన్నారు. వైసీపీ పతనం మొదలైందని, వారంలో నోటిఫికేషన్ వస్తుందని ఎవరు భయపడాల్సిన అవసరం లేదన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: