Monday, 27 July 2026 08:55:28 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

సముద్రంలో చేపలవేటకు వెళ్ళరాదు. పునరావాస కేంద్రాల ఏర్పాటుకు సిద్దంగా వుండాలి.

అధికారులు సెలవుల్లో వుంటే వెంటనే విధుల్లోకి చేరాలి : జిల్లా కలెక్టర్

Date : 02 December 2023 04:40 PM Views : 640

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : తిరుపతి, డిసెంబర్ 02: తుఫాన్ చెన్నై –నెల్లూరు మధ్య తుఫాన్ తీరందాటే అవకాశం వుందని పడమట దిశగా మారితే ప్రభావం జిల్లాపై అధికంగా ఉంటుందని, పునరావాస ఏర్పాట్లు సిద్డంచేయాలని ప్రభుత్వ అధికారులు , సిబ్బంది సెలవుల్లో వుంటే వెంటనే విదుల్లోచేరి అందుబాటులో వుండాలని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి ఆదేశించారు.           శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్లో జిల్లా అధికారులతో , డివిజన్ మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించి తుఫాన్ ప్రభావంపై జిల్లాలో అధికారులు చేపట్టాల్సిన పనులపై కలెక్టర్, జెసి డి కె బాలాజీ  పలు సూచనలు చేసారు.           జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మిచాంగ్ తుఫాన్ ప్రభావం ఈ నెల 3,4,5 జిల్లాలో ప్రభావం వుందని, ఇప్పటికే జిల్లా లో వర్షాలు పడుతున్నాయి,  తుఫాన్  వల్ల మరింత ప్రభావం ఉంటుందని అప్రమత్తంగా  వుండాలని అన్నారు. అధికారులు, సచివాలయ సిబ్బంది స్థానికంగానే 24 గంటలు అందుబాటులో వుండాలి అన్నారు. డివిజన్ స్థాయి లో ఆర్డిఓ లు , డి ఎస్ పి లు తమపరిధిలో ఎలాంటి మానవ , పశు సంపద నష్టం జరగకుండా ప్రణాలికలు , హెచ్చరికలు జారీచేయాలని డివిజన్, మండల స్థాయ్లి కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు కావాలని ఇప్పటికే తెలిపామని అన్నారు.   ప్రభావిత ప్రాంతాలు ఈ రోజే  పర్యటించి అవసరమున్న చోట చేపట్టాల్సిన పునరావాస కేంద్రాలు , లోతట్టు ప్రాంతాల వారిని గుర్తించి అప్రమత్తం చేయాలని అన్నారు. పునరావాస కేంద్రాలల్లో అన్నివసతులు వుండేలా చూడాలని అన్నారు. మండల స్థాయిలో తహసిల్దారులు ఎస్.హెచ్ .ఓ.లు సమన్వయంతో చర్యలు చేపట్టాలని అన్నారు. పెట్రో ల్ బంకు లో డీజల్, పెట్రోల్ అత్వసర పరిస్థిల్లో స్టాక్ ఉండేలా చూడాలని, గ్యాస్ సిలిండర్లు అందుబాటులో వుండాలని అన్నారు.  గ్రామాల్లో , పట్టణాల్లో డి పి ఓ, మునిసిపల్ శాఖలు నేడే మురికి కాలువలు పూర్తి స్థాయిలో శుబ్రపరచాలి, నీటిపారుదల శాఖ త్రాగునీటి ట్యాంకుల సుబ్రపరిచి నిరంతరం నీటిని నింపేలా , త్రాగునీరు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. రహదారులకు సంబంధించి పంచాయితీ రాజ్ , ఆర్  అండ్ బి శాఖలు , ఇరిగేషన్ శాఖ ఇప్పటికే జిల్లాలో వర్షాలు పడుతున్నాయి చెరువులు, వాగులు, వంకల వద్ద సిబ్బంది నియమించి పర్యవేక్షించాలి అన్నారు. పశుసవర్తక శాఖ ఫీడ్ , పాడర్ , మెడిసిన్ అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ పిహెచ్ సిలు, సిహెచ్ సి లు 24 గంటలు అందుబాటులో వుండాలి అన్నారు. పునరావాస కేంద్రాల వద్ద మెడికల్ క్యాంపులు ఏర్పాటు కావాలని అన్నారు. విద్యుత్ శాఖ అంతరాయం లేకుండా చూడాలని ఇబ్బందులు తలెత్తే వెంటనే పునరుద్ధరణ జరగాలని అన్నారు. చేపలవేట కు వెల్లినవారిని నిన్ననే తిరిగి రమ్మన్నాం, వచ్చారు అంటున్నారు మరోసారి మత్స్యశాఖ పరిశీలించాలి అన్నారు.           జేసి మాట్లాడుతూ జిల్లాలో రేషన్ పంపిణీ జరుగుతున్నది, ఎం.డి.యు.లు రెండురోజుల్లో పూర్తీ చేసేవిధంగా కొద్ది సమయం ఎక్కువగా కేటాయించి పంపిణీ చేయాలి, తుఫాన్ ప్రభావంతో రేషన్ అందలేదని ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడండి అన్నారు. జిల్లా కలెక్టరేట్ నుండి  డి ఆర్ ఓ పెంచల కిషోర్ , జిల్లా అధికారులు పాల్గొనగా డివిజన్ స్థాయి మండల స్థాయి అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: