Famous TV - ఆంధ్రప్రదేశ్ / : ఆదివారము: తిరుపతిలో హోటల్ స్టార్లెట్ సూట్స్ నందు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ అనస్థీషియా ( ఐ ఎస్ ఏ) రాష్టస్థ్రాయి సమావేశము జరిగినది. ఈ కార్యక్రమంలో ఐ ఎస్ ఏ రాష్ర్ట అద్యక్షులు డా.తారక ప్రసాద్,సెక్రటరీ డా అచ్యుత్ రామయ్య, ట్రెజరర్ శ్రీనివాస్ , ప్రెసిడెంట్ ఎలెక్ట్ డా. శ్రీనివాసరావు సూరి శెట్టి, ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ డా రాధ , సెక్రటరీ డా ప్రదీప్ మరియు ఐ ఎస్ ఏ జాతీయ పూర్వ అద్యక్షులు డా కామేశ్వర రావు, డా భీమేష్, డా కిరణ్,డా మోహన్ భాస్కర్,డా వేణు గోపాల్,డా ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఐ ఎస్ ఏ 2024-27 రాష్ట్ర సెక్రటరీ గా మదర్ హాస్పిటల్ చైర్మన్ డా.మదన్ ఎన్నిక అయ్యారు. ఐ ఎస్ ఏ 2024-27 రాష్ట్ర కోశాధికారి డా.శ్రీనివాస్ సూరి నేని,అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎస్వీ వైద్య కళాశాల ఎన్నిక అయ్యారు. ఈ సందర్భంగా ప్రతి యూనిట్ ఎక్సిక్యూటివ్ లు పాల్గొన్నారు. 2024, సెప్టెంబర్ లో తిరుపతి ఎస్ వి వైద్య కళాశాలలో జరగబోయే రాష్ట్ర స్థాయి ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ అనస్థీషియా( ఐ ఎస్ ఎ) కాన్ఫరెన్స్ గురించి మరియు కాన్ఫరెన్స్ బ్రోచర్ విడుదలచేయటము జరిగినది. దాదాపు 500 మంది డాక్టర్లు పాల్గొనే అవకాశం ఉందని ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
Admin
Famous TV