Sunday, 26 July 2026 07:33:00 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

నైపుణ్యాభివృద్ధి విభాగంలో ప్రతిష్టాత్మక "బెస్ట్ 3 స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఇనిషియేటివ్ ఆఫ్ ద ఇయర్ 2025 " అవార్డును అందుకున్న రాజన్న ఫౌండేషన్:

Date : 28 April 2025 04:42 PM Views : 565

Famous TV - ఆంధ్రప్రదేశ్ / : [తిరుపతి, 28.04.2025]: అమర రాజా కంపెనీ సౌజన్యంతో నడిచే రాజన్న ఫౌండేషన్ నైపుణ్యాభివృద్ధి విభాగంలో ప్రతిష్టాత్మకమైన *"బెస్ట్ 3 స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఇనిషియేటివ్ ఆఫ్ ద ఇయర్ 2025 "* నీ అందుకున్నది. ఈ అవార్డ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి, ప్రత్యేకంగా స్కిల్ డెవలప్‌మెంట్ రంగంలో రాజన్న ఫౌండేషన్ అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈరోజు దేశ రాజధాని న్యూఢిల్లీ లోని హయత్ సెంట్రిక్ హోటల్ నందు ప్రముఖ సి ఎస్ ఆర్ మార్కెటింగ్ మరియు బ్రాండ్ హానాక్ సంస్థ వారిచే గ్లోబల్ సి ఎస్ ఆర్ అవార్డ్స్ 2025 ప్రధానోత్సవ కార్యక్రమంలో ఈ అవార్డుని రాజన్న ఫౌండేషన్ హెడ్ సతీష్ రాళ్లపల్లి గారు ఆల్ ఇండియా పబ్లిక్ సెక్టార్ స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డ్,ఎక్స్ జనరల్ రమేష్ సచిదేవ్ గారి చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. నిరుద్యోగ్యవతి యువకులకు మల్టీ స్కిల్ డెవలప్మెంట్ మరియు వ్యక్తిగత వికాసం విభాగం తో కూడిన నైపుణ్యాభివృద్ధి సేవలు అందించడం ద్వారా వారికి మెరుగైన జీవనోపాధి అవకాశాలను పొందడంలో రాజన్న ఫౌండేషన్ యొక్క చొరవలకి గానూ ఈ అవార్డును అందించి గౌరవించినది. రాజన్న ఫౌండేషన్ ద్వారా 2014 లో స్థాపించిన అమరరాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా ఇప్పటివరకు దాదాపు 3000 నిరుద్యోగ యువతీ యువకులకు వివిధ విభాగాలలో నైపుణ్యాభివృద్ధి చేయడమే కాకుండా వారికి అమర రాజా సంస్థలో ఉద్యోగ అవకాశాలు కల్పించారు, తద్వారా ఆ నిరుద్యోగ యువత జీవితాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపడంతో పాటు, వారు స్వయం సమృద్ధిగా అభివృద్ధి చెందడానికి మరియు సమాజంలో గౌరవమైన జీవితాన్ని గడపడానికి దోహద పడింది. *ఈ అవార్డు అందుకోవడం పట్ల రాజన్న ఫౌండేషన్ ఫౌండర్ శ్రీ గల్లా రామచంద్ర నాయుడు గారు మాట్లాడుతూ "నైపుణ్యాభివృద్ధి విభాగంలో మా సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును అందుకోవడం మాకు సంతోషంగా ఉంది, మా కార్యక్రమాలు ద్వారా నైపుణ్యం అంతరాన్ని తగ్గించడం మరియు అందరికీ మరింత సమగ్రమైన మరియు స్థిరమైన భవిష్యత్తును సృష్టించడం లక్ష్యంగా పెట్టుకున్నాము. మరియు ఈ అవార్డు రావడానికి కృషి చేసిన అమర రాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ సిబ్బందిని మరియు విద్యార్థి విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేస్తున్నాను" అని అన్నారు.* *ఈ అవార్డు అందుకోవడం పట్ల అమర రాజా సంస్థల చైర్మన్ శ్రీ గల్లా జయదేవ్ గారు మాట్లాడుతూ "ఈ అవార్డు అందుకోవడం ద్వారా మా అమర రాజా స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థ ద్వారా సానుకూల సామాజిక ప్రభావాన్ని సృష్టించేందుకు రాజన్న ఫౌండేషన్ యొక్క నిబద్ధతకు నిదర్శనం మరియు అదేవిధంగా రాబోవు కాలంలో రాజన్న ఫౌండేషన్ ద్వారా అనేక రంగాలలో విశిష్టమైన సేవలు అందిస్తామని" అని అన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: