Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : మానవతా మూర్తి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అని ఎస్వీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ రాజారెడ్డి అన్నారు. దివంగత సీఎం డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 14 వ వర్ధంతి కార్యక్రమం ఎస్ వి యు లో వైఎస్ఆర్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు ఈ సందర్భంగా వీసీ రాజారెడ్డి మాట్లాడుతూ.. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానుభావుడు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అని తెలిపారు. విద్యారంగానికీ, పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా మేలు చేశారని కొనియాడారు. లక్షలాది మంది పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించిన గొప్ప నేత అని గుర్తు చేసుకున్నారు. యూనివర్సిటీల్లో ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారని చెప్పారు. రిజిస్టార్ హుస్సేన్ మాట్లాడుతూ.. డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి మానవీయ విలువలతో కూడిన పరిపాలన అందించారని అన్నారు. పాలకమండలి సభ్యురాలు ప్రొఫెసర్ భూమన సుగుణ రెడ్డి మాట్లాడుతూ.. వైయస్ రాజశేఖర్ రెడ్డి అత్యంత ప్రజాదరణ కలిగిన నేతని అన్నారు. అలాంటి గొప్ప నాయకున్ని కోల్పోవడం ఆంధ్రప్రదేశ్ చేసుకున్న దురదృష్టకరమని చెప్పారు. పాలకమండలి సభ్యులు సీకాం సురేందర్ రెడ్డి, జ్యోతి, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది రాజు, మురళి, శివా నంద రెడ్డి, సుబ్రమణ్యం, చంద్ర, నవీన్ , నాగరాజు, లోకేష్, జగదీష్, రాజేంద్ర, విద్యార్థి నాయకులు మణి, ,ప్రశాంత్, ప్రదీప్, ఖేదర్, మధు నాయక్, సుబ్బు, భార్గవ్, వెంకటేష్, భూపాల్, నరసింహ, తదితరులు పాల్గొన్నారు.
Admin
Famous TV