Sunday, 26 July 2026 04:49:22 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

పరిపాలనా సౌలభ్యము, శాంతి భద్రతల పరిరక్షణ కొరకు రాష్ట్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ ద్వారా తిరుపతి పోలీసు జిల్లాలో క్రింది మార్పులు చేయడం జరిగింది.

⏩ తిరుపతి ఈస్ట్ సబ్ డివిజన్ ను తిరుపతి సబ్ డివిజన్ గా పేరు మరియు పరిధి మార్పు. ⏩ తిరుపతి వెస్ట్ సబ్ డివిజన్ ను చంద్రగిరి సబ్ డివిజన్ గా పేరు మరియు పర

Date : 27 May 2023 05:20 PM Views : 524

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : . తిరుపతి వెస్ట్ సబ్ డివిజన్ ను చంద్రగిరి సబ్ డివిజన్ గా పేరు మరియు పరిధి మార్పులు. కొత్తగా ఏర్పడిన చంద్రగిరి సబ్ డివిజన్ లోకి 07 పోలీస్ స్టేషన్లను అనగా 1.తిరుపతి రూరల్ (గతంలో ముత్యాలరెడ్డి పల్లి/MR Palli) 2. తిరుచానూరు 3.చంద్రగిరి 4.రామచంద్ర పురం 5.పాకాల 6.యర్రవారి పాలెం 7.భాకరా పేట పోలీస్ స్టేషన్ లను చేర్చడం జరిగినది. గతంలో తిరుపతి ఈస్ట్ సబ్ డివిజన్ లో ఉండిన తిరుచానూరు పోలీస్ స్టేషన్ ని క్రొత్తగా ఏర్పడిన చంద్రగిరి సబ్ డివిజన్ లోనికి చేర్చడం జరిగినది. ఇదివరకు ఉన్న ముత్యాలరెడ్డి పల్లి పోలీస్ స్టేషన్ ను తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ గా మార్పు చేయడం జరిగినది. 2. తిరుపతి ఈస్ట్ సబ్ డివిజన్ ను తిరుపతి సబ్ డివిజన్ గా పేరు మరియు పరిధి మార్పులు. కొత్తగా ఏర్పడిన తిరుపతి సబ్ డివిజన్ లోకి 04 పోలీస్ స్టేషన్లను అనగా 1.తిరుపతి ఈస్ట్ 2.అలిపిరి 3.వెస్ట్ 4.శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ (SVU) పోలీస్ స్టేషన్ లను చేర్చడం జరిగింది. గతంలో తిరుపతి వెస్ట్ సబ్ డివిజన్ లో ఉన్న తిరుపతి వెస్ట్ మరియు ఎస్.వి యూనివర్సిటి పోలీస్ స్టేషన్ లను ప్రస్తుతం క్రొత్తగా ఏర్పడిన తిరుపతి సబ్ డివిజన్ లోనికి చేర్చడం జరిగినది.

ముత్యాలరెడ్డి పోలీసు స్టేషన్ పేరును తిరుపతి రూరల్ పోలీసు స్టేషన్ గా మారుస్తూ మరియు పరిధిలలో మార్పులు. ముత్యాలరెడ్డి పల్లి పోలీస్ స్టేషన్ ని తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ గా పేరు మార్పు చేయడం జరిగినది. అంతేకాకుండా ముత్యాలరెడ్డి పల్లి పోలీస్ స్టేషన్ యొక్క పరిధి లో ఇంతకు మునుపు ఉన్న 15 గ్రామ పంచాయతీలు అనగా గాంధీపురం, చిగురువాడ, దుర్గసముద్రం, మల్లంగుంట, రామానుజపల్లి, సి.గొల్లపల్లి, పైడిపల్లి, పాతకాల్వ, పెరుమాళ్లపల్లి, సి. మల్లవరం, చెర్లోపల్లి, వెంకటపతి నగర్, పుదిపట్ల, పేరూరు, తుమ్మలగుంట లను యధావిధిగా తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ లో కొనసాగుతాయి. ఇది వరకు తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధి లో నున్న 1.అవిలాల 2.లింగేశ్వర్ నగర్ 3.సాయి నగర్ 4.ఓటేరు 5.శ్రీనివాసపురం గ్రామ పంచాయతీ లను అనగా ESI హాస్పిటల్ జంక్షన్ నుండి శ్రీనివాస కళ్యాణ మండపం వరకు, శ్రీనివాస కళ్యాణ మండపం నుండి సింధు ఫ్లై ఓవర్ జంక్షన్ వరకు, సింధు ఫ్లై ఓవర్ జంక్షన్ నుండి RC పురం జంక్షన్ వరకు, RC పురం జంక్షన్ నుండి ESI హాస్పిటల్ జంక్షన్ వరకు ఉన్న ఈ నాలుగు ప్రధాన మార్గాల మధ్య ఉన్న ప్రాంతాల నన్నింటినీ తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి లోకి కలపడం జరిగినది. తిరుపతి ఈస్ట్, అలిపిరి, తిరుపతి వెస్ట్, ఎస్.వి.యు., తిరుచానూరు పోలీసు స్టేషన్ల పరిధిలలో మార్పులు. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మార్పులు:- ఇది వరకు ముత్యాలరెడ్డి పల్లి పోలీస్ స్టేషన్ పరిధి లో ఉన్న తిరుపతి, మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ 15 మరియు 14 వ డివిజన్ లో కొంత భాగం అనగా అన్నమయ్య సర్కిల్ నుండి E.S.I హాస్పిటల్ జంక్షన్ వరకు తూర్పు బాగంలో ఉన్న బైరాగిపట్టెడ మరియు ఇతర ప్రాంతములు మరియు E.S.I హాస్పిటల్ జంక్షన్ నుండి, SGS ఆర్ట్స్ కాలేజీ జంక్షన్ వరకు ఉన్న రోడ్డుకు ఉత్తరం వైపు ఉన్న ప్రాంతాలను, ఇది వరకు తిరుచానూరు పరిధిలో ఉన్న తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ 14 వ డివిజన్ లోని శ్రీనివాస కళ్యాణమండపం నుండి వివేకానంద విగ్రహం రాఘవేంద్ర నగర్ 5th క్రాస్ నుండి కేశవాయనగుంట మెయిన్ రోడ్డు ఈ మధ్యలో ఉన్న భాగం అంతాను తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధి లోనికి మార్చడం జరిగినది.

అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో మార్పులు:- కొరమీను గుంట ప్రాంతం ఇదివరకు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిదిలో వుండినది ప్రస్తుతము సదరు ఏరియా పూర్తిగా అలిపిరి పోలీస్ స్టేషన్ యొక్క పరిది లోనికి మార్చడం జరిగింది. తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మార్పులు:- అలిపిరి పోలీస్ స్టేషన్ యొక్క పరిది లోని ఏరియాలు ఆర్.కె. డీలక్స్ జంక్షన్ నుండి గరుడ సర్కిల్ వరకు, స్విమ్స్ హాస్పిటల్, రుయా ఆసుపత్రి, బర్డ్ ఆసుపత్రి, ఆయుర్వేదిక్ కాలేజీ మరియు సంభందిత స్టాఫ్ క్వార్టర్స్, గరుడ సర్కిల్ నుండి జూ పార్క్ రోడ్, వేదిక్ యునివర్సిటి, సైన్స్ సెంటర్, అరవింద్ ఐ ఆసుపత్రి, టాటా కాన్సర్ హాస్పిటల్, భారతీయ విద్యా భవన్ వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి మార్పు చేయడం జరిగింది. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ (SVU) పోలీస్ స్టేషన్ పరిధిలో మార్పులు:- ముత్యాలరెడ్డి పల్లి పోలీస్ స్టేషన్ పరిధి లో ఉన్న తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్లు 19, 20 మరియు 22 వ డివిజన్ లో కొంత భాగం అనగా అన్నమయ్య సర్కిల్ నుండి అవిలాల జంక్షన్ వరకు ఉన్న రోడ్డుకు పడమర గా ఉన్న ప్రాంతాలను, అవిలాల జంక్షన్ నుండి వైకుంఠపురం, తెలుగు తల్లి విగ్రహం, చాముండేశ్వరి గుడి వరకు ఉత్తరం వైపుగా గల ప్రాంతాలు మరియు L.S నగర్ లని యస్.వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధి లోనికి మార్చడం జరిగినది. తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మార్పులు:- తిరుచానూరు పోలీస్ స్టేషన్ యొక్క పరిధి లో ఇంతకు మునుపు ఉన్న 9 గ్రామ పంచాయతీలు అనగా తిరుచానూరు, పద్మావతి పురం, వేదాంతపురం, కేసిపేట, తనపల్లి, పాడిపేట, ముండ్లపూడి, బ్రాహ్మణపట్టు, కుంట్రపాకం తిరుచానూరు పోలీస్ స్టేషన్ లో యధావిధిగా కొనసాగుతాయి. ఇది వరకు అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధి లో ఉన్న 5 గ్రామ పంచాయతీలు అనగా 1.మంగళం క్వార్టర్స్ 2.రణధీర్ పురం 3.సప్తగిరి నగర్ 4.బిటిఆర్ పురం 5.శెట్టిపల్లి పంచాయతీలో గల ప్రాంతాలైన మంగళం, మిట్ట గాంధీ పురం, చెన్నాయగుంట గ్రామము లను తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధి లోకి కలపడం జరిగినది. కావున, పోలీస్ సంబంధిత సేవల కొరకు ప్రజలు పైన తెలిపిన పోలీస్ స్టేషన్ ల పరిధులలో మార్పులను గమనించగలరని కోరడమైనది. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి లు కులశేఖర్ శాంతి భద్రత, డిఎస్పి లు సురేంద్ర రెడ్డి, యశ్వంత్, సిఐలు సురేంద్ర రెడ్డి, రవీంద్రనాథ్, సుబ్రమణ్యం రెడ్డి, అబ్బన్న వారు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: