Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : వ్యక్తిత్వ నిర్మాణమే ప్రగతికి సోపానమని జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ జాతీయ అధ్యక్షుడు అంకుర్ జున్ జున్ వాలా చెప్పారు. రెండు రాష్ట్రాల జెసిఐ చాప్టర్ అధ్యక్షుల మూడు రోజుల శిక్షణా శిబిరాన్ని సోమవారం ఆయన తిరుపతిలోని గోల్డెన్ తులిప్ హోటల్లో ప్రారంబించారు. చదువుతో పాటు సామర్థ్యాలు, నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు. సామాజిక స్పృహ, జాతీయ భావంతో సేవా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. జాతీయ ఉపాధ్యక్షుడు సుమిత్ గోయల్ అధ్యక్షత వహించారు. శిబిర శిక్షకులు, శిరీష్ దండూ, పూసర్ల రజిత, ఎన్ బి హర్ష వర్ధన్ రెడ్డి ప్రసంగించారు. మూడు జోన్ ల అధ్యక్షులు సంతోష్, చతుర్వేది, భరత్, జాతీయ నేతలు జి ఎల్ మనోహర్, కృష్ణమూర్తి 85 మంది చాప్టర్ అధ్యక్షులు పాల్గొన్నలు.
Reporter
Famous TV