Sunday, 26 July 2026 04:11:57 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

తిరుపతి వాసులకు అదిరిపోయే న్యూస్..!

ఆకాశం నుంచి చంద్రగిరి కోట అందాలు చూడవచ్చు - హెలికాప్టర్ జాయ్ రైడ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి

Date : 16 June 2023 03:59 PM Views : 766

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులతో పాటు తిరుపతి నగర వాసులకు అదిరిపోయే న్యూస్ ఇది.. తిరుపతి చుట్టుపక్కల అందాలను ఆకాశం నుంచి తిలకించేందుకు అద్భుత అవకాశం అందుబాటులోకి వచ్చింది. ‘ఏరో డాన్’ అనే సంస్థ తీసుకు వచ్చిన జాయ్ రైడ్‌‌ని శుక్రవారం చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే చెవిరెడ్డి ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ ఎంసీ విజయానంద రెడ్డితో కలసి హెలికాప్టర్ ఎక్కి చంద్రగిరి కోట వరకు వెళ్లి వచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతి పోలీస్ గ్రౌండ్ నుంచి ప్రారంభమయ్యే జాయ్ రైడ్ వల్ల తిరుపతి, చంద్రగిరి చుట్టు ప్రక్కల ప్రదేశాలను విహంగ వీక్షణం చేయొచ్చని, నాలుగు రోజుల పాటు ట్రయల్ రన్ నిర్వహిస్తారని వెల్లడించారు. ఆరు సీట్ల కెపాసిటీ వున్న హెలికాప్టర్‌లో పైలట్ కాకుండా ఐదుగురు పర్యాటకులు ఎక్కేందుకు అవకాశముందన్నారు. చంద్రగిరి కోట అందాలను ఆకాశం నుంచి తిలకించే అద్భుతమైన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అనంతరం ఏరోడాన్ సంస్థ నిర్వాహకులు మాట్లాడుతూ తిరుపతి పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ నుంచి చంద్రగిరి పోర్టు వరకు వెళ్లి తిరిగి తీసుకొస్తామని, ఈ రైడ్ కేవలం 8 నిమిషాల్లోనే పూర్తవుతుందని, ఒకగంటకు ఆరు రైడ్లు నిర్వహించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఇందుకోసం ఒక్కొక్కరికి రూ.6 వేలు వసూలు చేస్తున్నట్లు వివరించారు. శ్రీవారి దర్శనం కోసం తిరుపతికి వచ్చే వేలాది మంది భక్తులతో పాటు తిరుపతి వాసులకు చుట్టు పక్కల అందాలను ఆకాశం నుంచి చూపించాలనే మంచి ఉద్దేశంతోనే ఈ రైడ్ ప్రారంభిస్తున్నట్లు ఏరో డాన్ ప్రతినిధులు చెప్పారు. నాలుగు రోజుల పాటు నిర్వహించే రైడ్ సక్సెస్ అయితే తిరుపతి టు చెన్నై మార్గంలో కూడా ప్రవేశపెట్టే ఆలోచన ఉందని స్పష్టం చేశారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :