Monday, 27 July 2026 09:52:49 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

సాంఘిక సంక్షేమ శాఖ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందేలా సంక్షేమ అధికారులు పనిచేయాలి

సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో నూతన మెనూను సక్రమంగా అమలు చేయాలి: మంత్రి మేరుగ నాగార్జున

Date : 13 June 2023 05:25 PM Views : 793

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : సంక్షేమ వసతి గృహ అధికారులు వారి వసతి గృహం దగ్గరలో నివాసం ఉండాలి.సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా అమలు చేయబడుతున్న వివిధ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందరికీ అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో నూతన మెనూను సక్రమంగా అమలు చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామాత్యులు మేరుగ నాగార్జున సంబంధిత అధికారులతో అన్నారు. మంగళవారం మధ్యాహ్నం స్థానిక పద్మావతి అతిథి గృహం తిరుపతి నందు చిత్తూరు, తిరుపతి జిల్లాల సాంఘిక సంక్షేమ మరియు సాధికార అధికారులు, సహాయ సాంఘిక సంక్షేమ అధికారులు, ఈడి ఎస్సీ కార్పొరేషన్, జిల్లా కోఆర్డినేటర్ గురుకుల పాఠశాలలు, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల ప్రిన్సిపాల్ లతో మంత్రివర్యులు సమీక్ష సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ఎస్సీలకు అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు సాంఘిక సంక్షేమ అధికారుల ద్వారా అర్హులైన లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వసతి గృహాల నిర్వహణ, పరీక్ష ఫలితాలపై, కళాశాలల హాస్టల్ ల నిర్వహణ మొదలైన అంశాలపై సమీక్ష నిర్వహిస్తూ పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించే దిశలో ఇప్పటినుండే ప్రణాళికబద్ధంగా చర్యలు చేపట్టాలని సంక్షేమ అధికారులకు సూచించారు. కళాశాలల వసతి గృహాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వసతి గృహ అధికారులు వారి వసతి గృహం వద్దనే నివాసం ఉండేలా ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. నూతన మెనూను సక్రమంగా అమలు చేయాలని అధికారులు వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. కళాశాలల వసతి గృహాల లోని కళాశాల విద్యార్థులు క్రమశిక్షణతో మెలిగేలా పోలీసుల సహకారంతో కౌన్సిలింగ్ నిర్వహించి వారు పెడదారిన పట్టకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి, చిత్తూరు జిల్లాల జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార అధికారులు చెన్నయ్య, రాజ్యలక్ష్మి, ఈడీ ఎస్సీ కార్పొరేషన్ నర్సింహులు, జిల్లా కోఆర్డినేటర్ గురుకుల పాఠశాలలు జయభారతి, సహాయ సాంఘిక సంక్షేమ అధికారులు తదితర అధికారులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: