Famous TV - ఆంధ్రప్రదేశ్ / : రాష్ట్రవ్యాప్తంగా యూనివర్సిటీలో పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, టైం స్కేల్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని జూలై 24న చలో కలెక్టరేట్ ధర్నాలను జయప్రదం చేయండి అని ఆల్ యూనివర్సిటీస్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఎస్ కోటేశ్వరరావు పిలుపునిచ్చారు ఈరోజు తిరుపతి వ్యవసాయ కళాశాలలో కాంట్రాక్టు ఉద్యోగుల సమావేశంలో మాట్లాడుతూ ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేయాలని, అప్పటి వరకు సమాన పనికి - సమాన వేతనం అమలు చేయాలనీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2, 2014 నాటికి 5 సం॥ల సర్వీసు పూర్తి చేసిన కాంట్రాక్ట్ ఉద్యోగులను మాత్రమే రెగ్యులరైజ్ చేస్తూ నిర్ణయించడం వలన అతి కొద్ది మంది మాత్రమే రెగ్యులరైజ్ అవుతారని, కావున 2022 డిసెంబర్ 31 నాటికి పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్స్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు... వీరంతా ఏ నాటికైనా తాము రెగ్యులర్ అవుతామన్న ఆశతో అతి తక్కువ వేతనాలతో పని చేస్తున్నారు. కావున గత ఎన్నికల సందర్భంగా, మరియు ప్రజా సంకల్ప పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, టైం స్కేల్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని లేనియెడల ఉద్యోగులను ఐక్యం చేసి జూలై 24తేది చలో కలెక్టరేట్ పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆల్ యూనివర్సిటీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి గండికోట నాగ వెంకటేష్, వ్యవసాయ కళాశాల టైం స్కేల్ యూనియన్ అధ్యక్షులు మురళి, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు వరలక్ష్మి, రాకేష్, చంద్రమ్మ, గుణ, సాయి, సుబ్బు, మునిలక్ష్మి, సరస్వతి, ఆప్కాస్ యూనియన్ నాయకులు రవి, మదన్, చంద్ర, శివప్రసాద్, నేను, భువన తదితరులు పాల్గొన్నారు.
Admin
Famous TV