Monday, 27 July 2026 09:51:27 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

ఎస్వీ వైద్య కళాశాల నిరంతర వైద్య విద్య విజయవంతం

Date : 22 November 2023 04:42 PM Views : 618

Famous TV - ఆంధ్రప్రదేశ్ / : ; తిరుపతి లోని శ్రీ వేంకటేశ్వర వైద్య కళాశాల మరియు ఐ.సి.ఎం.ఆర్ - జాతీయ పోషకాహార సంస్థ, హైదరాబాదు సంయుక్త ఆధ్వర్యంలో నవంబర్ 21 మరియు 22 తేదీలలో “క్వాలిటేటివ్ రీసెర్చ్” అనే అంశంపై వర్క్‌షాప్‌ను నిర్వహించారు. దీనిలో పాల్గొంటున్న వారికి గుణాత్మక పరిశోధన యొక్క ప్రాథమిక భావనలు మరియు సాంకేతికతలను పరిచయం చేయడానికి మరియు వైద్యంలో గుణాత్మక డేటాను కఠినమైన మరియు నైతిక పద్ధతిలో నిర్వహించడానికి మరియు విశ్లేషించడానికి వీలు కల్పించడానికి ఈ వర్క్‌షాప్‌ రూపొందించబడింది. ఈ వర్క్‌షాప్‌ లో ఈ రోజు అనగా నవంబర్ 22 తేదీన జరిగిన కార్యక్రమంలో శ్రీ వేంకటేశ్వర వైద్య కళాశాల అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపాల్ డా. పి.ఏ. చంద్రశేఖరన్ మరియు వైద్య అధ్యాపకులు పాల్గొన్నారు. చిత్తూరు అపోలో మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ డా. ఎం. ఎస్. శ్రీధర్; ఎం.ఆర్.హెచ్.ఆర్.యు. నోడల్ ఆఫీసర్ డా. ఎస్. సునీత, ఐ.సి.ఎం.ఆర్ - జాతీయ పోషకాహార సంస్థ శాస్త్రవేత్త డా. జి. సుబ్బారావు, ప్రపంచ ఆరోగ్య సంస్థ కన్సల్టెంట్ డా. పి. సత్యేంద్ర నాథ్; శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం జర్నలిజం ప్రొఫెసర్ డా. టి. త్రిపుర సుందరి; మహాత్మా గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, సేవాగ్రామ్, మహారాష్ట్ర ప్రొఫెసర్ డా. అభిషేక్ రౌత్, ఈ వర్క్‌షాప్‌లో పాల్గొని తమ విలువైన ప్రసంగాలు చేశారు. ప్రశ్నాపత్రం/ఇంటర్వ్యూయర్స్ గైడ్ రూపకల్పన, గుణాత్మక పరిశోధన విశ్లేషణ, మిశ్రమ పద్ధతుల పరిశోధన, క్వాలిటేటివ్ పరిశోధనలో ఉపయోగించే సాఫ్ట్‌వేర్‌లు మరియు కృత్రిమ మేధస్సు (ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్) ల ఉపయోగం, ఫోకస్ గ్రూప్ చర్చ మొదలగు వాటి గురించి కూలంకషంగా తెలియచేసారు. ఈ కార్యక్రమంలో ఎం.ఆర్.హెచ్.ఆర్.యు. చంద్రగిరి శాస్త్రవేత్తలు డా. యు.వి. ప్రసాద్, డా. జి. వెన్నెల సాహితి మరియు సిబ్బంది; శ్రీ వేంకటేశ్వర వైద్య కళాశాల పి.ఆర్.ఓ. వీరకిరణ్ పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :