Famous TV - ఆంధ్రప్రదేశ్ / : ఎస్ వి. వైద్య కళాశాలలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలతో, ఘనంగా నివాళులర్పించిన ఎస్వీ వైద్య కళాశాల అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ పి ఏ చంద్రశేఖరన్. ఎస్వీ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ అణగారిన ప్రజల వాస్తవ స్థితిగతులను గుర్తించి వాటి పరిష్కారంలో ప్రపంచానికే ఓ దిక్సూచిగా నిలిచిన మహాపురుషుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్. ప్రపంచ మానవ చరిత్రలోనే గొప్ప విలువలు కలిగిన మహోన్నత వ్యక్తి. పోరాట యోధుడు మేధావి, విజ్ఞాని, ప్రపంచానికే నిలువెత్తు ఆదర్శమూర్తి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్. తరతరాలుగా దోపిడీకి గురవుతున్న పేద, దళిత, బడుగు, బలహీన వర్గాల వారికి అండా, దండ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్. పీడిత ప్రజల కోసం పోరాడేవారికి అంబేద్కర్ ఓ కరదీపిక.వాళ్లూ, వీళ్లూ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అంబేద్కర్ నామ జపం చేయాల్సినంతగా, అంబేద్కర్ ఆదర్శమూర్తిగా నిలిచారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ మాత్రం ఎన్నటికీ పేద, పీడిత, అణగారిన వర్గాల పక్షపాతి. ఈ కార్యక్రమానికి ఎస్ వి వైద్య కళాశాల వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల జిల్లా ప్రెసిడెంట్ చంగల్ రాయులు, వైస్ ప్రెసిడెంట్ గోవింద్, తిరుపతి బ్రాంచ్ ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ జనరల్ సెక్రెటరీ కె .సి. సుబ్రహ్మణ్యం, ఎస్ వి వైద్య కళాశాల సిబ్బంది గోవర్ధన్, ముని కేశవులు, జాయింట్ సెక్రెటరీ మురళి, రాజ్ కుమార్ , ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాలరాజు, మరియు ఎస్ వి వైద్య కళాశాల పిఆర్ఓ వీర కిరణ్ పాల్గొన్నారు.
Admin
Famous TV