Famous TV - ఆంధ్రప్రదేశ్ / : శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల నందు వైద్య అధ్యాపకులకు నిరంతర వైద్య వైద్య లో భాగంగా 'బేసిక్ కోర్స్ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్ 'అను మూడు రోజుల శిక్షణా కార్యక్రమం ప్రారంభించడం జరిగినది. ఎస్వీ వైద్య కళాశాల, మెడికల్ ఎడ్యుకేషన్ విభాగం, మరియు తమిళనాడు సీ.ఎం.సీ వేలూరు వైద్య కళాశాల వారి ఆధ్వర్యంలో 9 వ తేది నుండి 11 వ తారీకు జనవరి 2024, వరకు నిర్వహించబడును అని తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమంలో 30 మంది వైద్య అధ్యాపకులకు వైద్య విద్య భోధనలో నూతన పద్ధతుల గురించి పూర్తి శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నరు అని అన్నారు. ఈ కార్యక్రమంను అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపాల్ డా, పిఏ. చంద్ర శేఖరన్ మాట్లాడుతూ, ఈ శిక్షణా తరగతులు గురించి వైద్య అధ్యాపకులకు నేషనల్ మెడికల్ కమిషన్ వారి ఆదేశాల మేరకు వైద్య విద్య బోధనలో తీసుకోవలసిన జాగ్రత్తలు మెలకువలు గురించి వారికి, ఈ నూతన వైద్య విద్య బోధనా పద్ధతులు గురించి విద్యార్థులకు మరియు అధ్యాపకులకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమం లో రుయా ఆసుపత్రి సూపరిటెండెంట్ డాక్టర్ జి.రవి ప్రభు, మాట్లాడుతూ మాట్లాడుతూ ఈ శిక్షణ తరగతులు వలన క్లినికల్ నాన్ క్లినికల్ విభాగాల్లో వైద్య విద్యను అభ్యసిస్తున్న వైద్య విద్యార్థులకు అధునాతన పద్ధతుల్లో పేదవారికి వైద్యం ఎలా అందించాలో అనే అంశం మీద చర్చించడం జరుగుతుంది. దీనివలన పేద రోగులకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించడంలో మెలకువలను తెలుసుకోవచ్చని తెలిపారు. అదేవిధంగా యూజీ, పిజీ వైద్య విద్యార్థులకు వైద్య విద్య ను అందించేటప్పుడు వారికి ఇలాంటి కార్యక్రమాలు వలన మెరుగైన వైద్య విద్యను నేర్పించడం జరుగుతుంది అని అన్నారు. అకాడమిక్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ కిరీటి, మాట్లాడుతూ సిఎంసి వేలూరు నుండి విచ్చేసిన డాక్టర్ ప్రకాష్, నేషనల్ మెడికల్ కమిషన్, న్యూఢిలి కోఆర్డినేటర్ ఆధ్వర్యంలో ఈ శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నారని తెలిపారు.డాక్టర్ వెంకటేశ్వర్లు వైస్ ప్రిన్సిపాల్ (అడ్మిన్ )డాక్టర్ మాధవి లత, డాక్టర్ సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Admin
Famous TV