Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీసుల మరియు క్రీడా శాఖ మంత్రివర్యులు శ్రీమతి ఆర్.కె.రోజా గారు నగరి మున్సిపాలిటీ కాకవేడు ఆది ఆంధ్రవాడ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీ మాతమ్మ తల్లి ఆలయ మహా కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమంలో బుధవారం పాల్గొన్నారు. కాకవేడు ఆదిఆంధ్రవాడ గ్రామ ప్రజల చిరకాల కోరికఫై స్పందించిన మంత్రి గారు తిరుమల తిరుపతి దేవస్థానం వారితో పది లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయించారు. శ్రీ మాతమ్మ ఆలయ కమిటీ సభ్యులు వేద పండితులు మంత్రిగారిని వేదమంత్రాలతో ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో నగరి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కమిటీ సభ్యులు వైస్సార్సీపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
Famous TV