Monday, 27 July 2026 08:55:13 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

ఎస్వీ వైద్య కళాశాల పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థులకు నూతన వసతి భవనము ప్రారంభం.

Date : 26 February 2024 05:56 PM Views : 666

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : సోమవారము ఎస్ వి వైద్య కళాశాల ప్రాంగణము ప్రసూతి ఆసుపత్రికి ఎదురుగా పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థుల కొరకు నూతన వసతి గృహాన్ని ప్రారంభిం. ఎస్వీ వైద్య కళాశాల అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖరన్ ఆధ్వర్యంలో, ముఖ్యఅతిథిగా తిరుపతి శాసనసభ్యులు మరియు టీటీడీ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ కరుణాకర్ రెడ్డి, చేతుల మీదుగా ప్రారంభోత్సవం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, వైద్యం మీద ప్రత్యేక శ్రద్ధ వహించి, ఎన్నో కార్యక్రమాలు పేదలకు అందిస్తున్నరు. అందులో భాగంగా వైద్యం అందించే పీజీ వైద్య విద్యార్థులకు వసతి గృహం ఎంతైనా అవసరం ఉందని గ్రహించి. పేద రోగులకు మెరుగైన వైద్యం అందించడంలో వాళ్ల పాత్ర ఎంతో ఉంటుంది కనుక , వారికి ఆసుపత్రి, వైద్య కళాశాల ప్రాంగణంలోనే మెరుగైన అధునాతన వసతులతో వైద్య విద్యార్థుల కొరకు వసతి గృహాన్ని ఈరోజు వైద్య విద్యార్థులకు కేటాయించడం జరుగుతున్నది. ఇకమీదట పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థులు వసతి గృహం లేదనే భావన లేకుండా మెరుగైన వైద్యం అందిస్తూ మెరుగైన వైద్య విద్యను నేర్చుకొని తిరుపతి ఎస్వీ వైద్య కళాశాలను ప్రగతి పథంలో నిలుపుతారని ఆశిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థుల కోసం హాస్టల్ భవనం నిర్మాణం (పురుషులు) , తిరుపతి ఎస్ వి .వైద్య కళాశాల ఆవరణలో 200 మంది విద్యార్థులకు మరియు వంటగది కమ్ డైనింగ్ హాళ్లకు రూ . 1675.00 లక్షలు, హాస్టల్ బ్లాక్‌లోని తిరుపతి ( G + 2 ) గదులు - 209 సంఖ్యలు , వార్డెన్ గది - 1, అడ్మిన్ గది - 1 , టాయిలెట్ బ్లాక్‌లు - 6 , వాషింగ్ ఏరియా - 3 డైనింగ్ హాల్ , కిచెన్ ఏరియా , మీడియా రూమ్ , జిమ్ / ఇండోర్ స్పోర్ట్స్ రూమ్ ఇందులో ఉన్నవి. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంటు సభ్యులు డాక్టర్ గురుమూర్తి, తిరుపతి నగర మేయర్ డాక్టర్ ఆర్ శిరీష, ఎస్వీ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటేశ్వర్లు, (పరిపాలన), డాక్టర్ సునీత, (అకాడమిక్ ), రుయా ఆసుపత్రి సూపరి టెండెంట్ డాక్టర్ జి రవి ప్రభు, ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పార్థసారధి రెడ్డి, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ వార్డెన్ డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, డాక్టర్ సుబ్బారావు, డాక్టర్ కిరీటి, యు జి.హాస్టల్ వార్డెన్ డాక్టర్ తులసీరామ్, ఏపీ.ఎమ్స్.ఐ. డి. సి. సూపర్డెంట్ ఇంజనీర్ కృష్ణారెడ్డి, లక్ష్మీపతి రెడ్డి ఈ ఈ, చిదంబరం ఎలక్ట్రికల్ ఈఈ, సురేష్ కుమార్ డి.ఈ,ఈ, హరి ప్రసాద్ రెడ్డి ఎలక్ట్రికల్ డి ఈ, ఈ, 23వ వార్డు కార్పొరేటర్ వెంకటేశ్వర్లు, కాంట్రాక్టర్ ముని మోహన్ రెడ్డి పీజీ, యూజీ వైద్య విద్యార్థులు మరియు ఎస్ వి వైద్య కళాశాల పిఆర్ఓ వీరకిరణ్ పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :