Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించాక.. అనేక మంది నేతలు మళ్లీ తెరపైకి వస్తున్నారు. ఇన్నాళ్లు కాస్త సైలెంట్‌గా ఉన్న లీడర్లు.. ఇప్పుడు పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తున్నారు. తాజాగా.. కేంద్ర మాజీమంత్రి చింతా మోహన్ కీలక ప్రకటన చేశారు. 2024 ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుదని.. కాపు నేతను సీఎం చేస్తామని స్పష్టం చేశారు. చింతా మోహన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ విజయం సాధిస్తుందని.. కేంద్ర మాజీమంత్రి చింతా మోహన్ విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. కాపు సామాజికవర్గానికి చెందిన నేత ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. కర్ణాటకలో అధికారాన్ని పంచిన విషయాన్ని గుర్తు చేసిన చింతా.. రెండున్నరేళ్లు కాపు నేత సీఎంగా ఉంటే.. మరో రెండున్నరేళ్లు ఓబీసీ వర్గానికి చెందిన నేతన ముఖ్యమంత్రి అవుతారని Chinta Mohan స్పష్టం చేశారు.
Admin
Famous TV