Sunday, 26 July 2026 01:39:00 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

ఎస్ వి వైద్య కళాశాల జోనల్ స్థాయి ఫారెన్సీక్ మెడిసిన్ నిరంతర వైద్య విద్య కార్యక్రమం విజయవంతం

Date : 02 December 2023 04:28 PM Views : 1633

Famous TV - ఆంధ్రప్రదేశ్ / : తిరుపతి ఎస్వీ వైద్య కళాశాల లో ఫారెన్సిక్ మెడిసిన్ వైద్య విభాగముందు ఈరోజు డాక్టర్ వైయస్సార్ వైద్య విశ్వవిద్యాలయం వారిచే సూచించబడిన "నిరంతర వైద్య విద్య" కార్యక్రమం జరిగినది. ఇందులో కర్నూలు,కడప, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి మరియు అనంతపురం, జిల్లాలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలు, మరియు ప్రైవేటు వైద్య కళాశాల యందున్నటువంటి ఫోరెన్సిక్ మెడిసిన్, విభాగము పీజీ వైద్య విద్యార్థులు గైనకాలజీ డిపార్ట్మెంట్కు చెందిన పీజీలు అధ్యాపకులు సైకియాట్రి డిపార్ట్మెంట్కు చెందిన పీజీలు అధ్యాపకులు, జోనల్ స్థాయిలో తెలిపిన వైద్య కళాశాలలు వైద్య విద్యార్థులు అధ్యాపకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో లైంగిక సమస్యలు వంధత్వము, నపుంసకత్వం, ఆధునిక పద్ధతుల ద్వారా సంతానం పొందడం, సరోగసి అద్దె గర్భము వంటి అంశాల మీద విస్తృతమైన బోధన జరిగినది. దీని వలన ప్రజలలో ప్రతి ఒక్కరికి అవసరమైన ఈ అంశం పైన వైద్యులలో వైద్య విద్యార్థులలో అవగాహన పెరగడం ద్వారా సంఘంలో మంచి వైద్యులుగా నిలబడగలరు. చట్టపరిధులలో వారు ఏమి చేయగలరో, లైంగిక సమస్యల నుండి బయటపడటానికి వైద్యులు అవలంబించవలసిన పద్ధతులు, చట్టం పరిధిలో వైద్యులు చేయగలిగిన, చేయవలసిన, పరీక్షలు వాటి గురించి అవగాహన పెరగడం వల్ల ఈ రకమైన సమస్యలతో బాధపడుతున్న బయటికి చెప్పుకోలేని అనేకమంది మానసిక శారీరక రోగాలకు వైద్యము ఉపశమనం కలిగే అవకాశం పెరుగుతుంది. ప్రారంభ కార్యక్రమంలో ఎస్ వి వైద్య కళాశాల అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖరన్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సునీత, వైస్ ప్రిన్సిపాల్ (అకాడమిక్,) డాక్టర్ వెంకటేశ్వర్లు వైస్ ప్రిన్సిపాల్ (అడ్మిన్ ), రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవి ప్రభు, గవర్నమెంట్ వెటర్నరీ హాస్పిటల్ డాక్టర్ పార్థసారధి రెడ్డి, ఫోరెన్సిక్ మెడిసన్ విభాగపు అధిపతి డాక్టర్ శశికాంత్ కార్యక్రమం ఆర్గనైజింగ్ చైర్మన్, డాక్టర్ సేపూరి రామ్మోహన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బెంగళూరు నుండి వైజాగ్ నుండి వచ్చినటువంటి ప్రొఫెసర్లు స్థానికంగా ఉన్నటువంటి సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ భాస్కర్ రెడ్డి ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ఈరోజు జరుగుతున్న "మెడికల్ లీగల్ ఆస్పెక్ట్స్ ఇన్ రిప్రొడక్టివ్ సిస్టం" కు సంబంధించి విస్తృతంగా పలు అంశాల గురించ చర్చ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మానస కిడ్నీ ఫౌండేషన్ తిరుపతి, బెంగళూరు నుండి డాక్టర్ అరుణిమ, విశాఖపట్నం నుండి డాక్టర్ మమత విభాగాధిపతి , మైసూరు మెడికల్ కాలేజీ నుండి డాక్టర్ అరుణ్, ప్రొఫెసర్ నిజామాబాద్ వైద్య కళాశాల నుండి ప్రొఫెసర్ డాక్టర్ సుధ , డాక్టర్ సేపూరి రామమోహన్ పై అంశం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఫారిన్సీక్ విభాగ వైద్యులు , దాదాపు అన్ని విభాగాల నుంచి 150 మంది పీజీ వైద్య విద్యార్థులు యూజీ వైద్య విద్యార్థులు మరియు ఎస్ వి వైద్య కళాశాల పి.ఆర్.ఓ, వీర కిరణ్ పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :