Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : ప్రస్తుతం వేసవి సెలవులు... కావున పిల్లలు, యువకులు సరదాగా జలపాతాలు, కాలువలు, బావులు, చెరువులు, సముద్ర తీరానికి వెళుతుంటారు. కాలువలు, బావులు, చెరువులలో ఈతకు దిగినప్పుడు, సముద్ర తీరాల యందు మునిగేటప్పుడు ప్రమాదాలకు గురి అవుతున్న సందర్భాలు మనం నిత్యం చూస్తూనే ఉంటున్నామని జిల్లా ఎస్పీ శ్రీ పి.పరమేశ్వర రెడ్డి ఐ.పి.యస్., గారు తెలిపారు. పిల్లలు ఈతకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, చిన్నారులకు ఈతరాకపోతే కలిగే ప్రమాదాల గురించి వివరించాలన్నారు. తల్లిదండ్రులే స్వయంగా వారి పిల్లలను వెంటబెట్టుకుని వెళ్లి దగ్గరుండి ఈత నేర్పించాలని సూచించారు. ఈతరానివారు స్నేహితులతో బావులు, కాలువలు, చెరువులు, కుంటలలో ఈతకు వెళితే వాటిలోతు తెలియని కారణంగా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుందన్నారు. బావులు, కాలువలు, జలపాతాలు చెరువులు, కుంటలలో ఈత కొట్టేముందు ఈత వచ్చిన వాళ్ళు సైతం వాటి లోతు ఎంత అనే విషయం కర్రల సాయంతో చూసుకోవాలన్నారు. సముద్ర తీర ప్రాంతాలకు విహార యాత్రలకు వెళ్లిన సమయంలో ఎక్కువ లోతులోకి వెళ్లకుండా పోలీస్ వారు సూచించిన నిర్దిష్ట లోతులోనే మునగాలన్నారు. మద్యం మత్తులో నీటిలోకి దిగే ప్రయత్నం చేయటం మంచిది కాదని జిల్లా ఎస్పీ గారు సూచించారు. వేసవి సెలవుల సరదా విషాదం కాకూడదు...ముఖ్యంగా జలపాతాలు, బావులు, చెరువులు, కాలువలు, నదులు, సముద్రం ఉన్నాయి. వేసవికాలంలో పిల్లలు విహార యత్ర అని, సరదా అని ఈత కు వెళుతుంటారు. ఆ ప్రదేశాలను గుర్తించి అక్కడ ప్రమాదపు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు.
Admin
Famous TV