Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : జనసేన అధ్యక్షులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అన్ని కులాలు సమానంగా చూస్తారని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. కులాలు కలిపే ఆలోచనా విధానం జనసేన విధానమని ఆయన చెప్పారు. బలిజ విద్యా సంస్థల ఆత్మీయ సమావేశం శనివారం మధ్యాహ్నం ఓ ప్రైవేట్ హోటల్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ అన్ని రంగాల్లో బలిజ సామాజికవర్గం రాణించాల్సి ఉందన్నారు. బలిజల్లోని పేద విద్యార్థులను చదివించడంలో మానవతా దృక్పథంతో విద్యా సంస్థల కరస్పాండెంట్ లు వ్యవహరించాలని ఆయన కోరారు. తన వంతుగా జేఎంసి ట్రస్ట్ నుంచి పేద విద్యార్థులను ఆదుకునేందుకు సాయం చేస్తామని ఆయన చెప్పారు. రాజకీయాలను తిరగరాసే శక్తి విద్యాసంస్థలు యజమానులు కు ఉందని అయన తెలిపారు. ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొని రాజకీయాల్లో తనముద్ర వేసిన పవన్ కళ్యాణ్ కు తోడ్పాటు అందించి మీరంతా రాయలసీమలో జనసేన బలోపేతానికి సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్, టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి కోడూరు బాలసుబ్రమణ్యం , కాలేజి కరస్పాండెంట్స్ రమణ, నరసింహులు, ఎస్వీ యూనివర్సిటీ డీన్ చెంగయ్య , మహేష్, శివయ్య తదితరులు పాల్గొన్నారు.
Admin
Famous TV