Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : సోమవారము ఎస్వీ వైద్య కళాశాల, ఆవరణములోని ఎస్వీ వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల భవనంలో నందు ఈ రోజు 2019 బ్యాచ్ స్టూడెంట్స్ ఇంటర్నషిప్ ప్రోగ్రాము లో భాగం గా మెడికల్ ఎతిక్స్ అవేర్నెస్ ప్రోగ్రాము జరిగినది. ఈ కార్యక్రమము ను ఎస్ వి. వైద్య కళాశాల అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపాల్ డాక్టర్. పి. ఏ. చంద్ర శేఖరన్ , అధ్యక్షన ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథి మరియు స్పీకర్, మెడికల్ ఎతిక్స్ సభ్యులు, (బీసీ.రాయ్ అవార్డు గ్రహీత) అయిన ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ మెంబర్, డాక్టర్ వైయస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం, డాక్టర్.రాయపు రమేష్ బాబు, మాట్లాడుతూ వైద్య వృత్తిలో, పేద రోగులకు, ప్రజలకు, వైద్యం అందించే వాటిలో తీసుకోవాల్సిన ముఖ్య జాగ్రత్తలు, మెరుగైన వైద్యం అందించడంలో వైద్యుల పాత్ర ఎంతో ముఖ్యమైనదని , ఈ 2019 వ సంవత్సరం వైద్య విద్యార్థుల బ్యాచ్ రేపు సంఘంలో మెరుగైన ఉత్తమమైన, వైద్యులుగా మెలగాలని , పాటించాల్సిన నైతిక విలువలు గురించి వైద్య విద్యార్థులకు ఆయన క్లుప్తంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ వి వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటేశ్వర్లు, (అడ్మినిస్ట్రేషన్), రుయా ఆసుపత్రి సూపరిటెండెంట్, డాక్టర్ జి రవి ప్రభు, ప్రసూతి ఆసుపత్రి సూపరిటెండెంట్ డాక్టర్ పార్థసారధి రెడ్డి, డాక్టర్ రాళ్ల ఉమాదేవి, వైద్యులు వైద్య విద్యార్థులు, మరియు ఎస్ వి వైద్య కళాశాల పిఆర్ఓ వీర కిరణ్ పాల్గొన్నారు.
Admin
Famous TV