Sunday, 26 July 2026 06:14:53 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

తిరుపతి ఎస్వీ వైద్య కళాశాల, రుయా ఆసుపత్రికి ప్లాస్టిక్ మరియు రీ కన్స్ట్రక్టివ్ సర్జరీ సూపర్ స్పెషాలిటీ పీజీ సీట్లు.

Date : 22 November 2023 06:40 PM Views : 574

Famous TV - ఆంధ్రప్రదేశ్ / : తిరుపతి ఎస్వీ వైద్య కళాశాల లో మొట్టమొదటిసారిగా సూపర్ స్పెషాలిటీ ప్లాస్టిక్ మరియు రీ కన్స్ట్రక్టివ్ సర్జరీ పిజి సీట్లు రాష్ట్ర ప్రభుత్వం కృషి ఫలితం వలన, కేంద్ర ప్రభుత్వం నేషనల్ మెడికల్ కమిషన్ వారి ఆదేశాల మేరకు నాలుగు ప్లాస్టిక్ సర్జరీ పీజీ సూపర్ స్పెషాలిటీ సీట్లు కేటాయించడం జరిగినది. ఈరోజు మొదటిది కౌన్సిలింగ్లో ఇద్దరూ సూపర్ స్పెషాలిటీ ప్లాస్టిక్ సర్జరీ సీట్లు తీసుకోవడం జరిగినది. ఈ సందర్భంగా అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ 60 సంవత్సరముల ఎస్వీ వైద్య కళాశాల చరిత్రలో మొట్టమొదటిసారిగా సూపర్ స్పెషాలిటీ ప్లాస్టిక్ సర్జరీ పీజీ వైద్య విద్యార్థులు ఈ రోజు చేరడంతో ఎన్నో సంవత్సరాల కళా నెరవేరిందని అని అన్నారు. రాబోవు రోజుల్లో ఇంకా సూపర్ స్పెషాలిటీ సీట్లు రావడానికి కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఎన్నో అవకాశాలు కలిగి ఉన్న ఎస్వీ వైద్య కళాశాల పేద రోగులకు మెరుగైన సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించడంలో మనం ముందు అడుగు వేస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. ప్రభుత్వానికి, వైద్యులకు, వైద్య సిబ్బందికి సహాయ సహకారాలు అందిస్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. మొట్టమొదటిసారిగా ఇద్దరు సూపర్ స్పెషాలిటీ ప్లాస్టిక్ మరియు రీ కన్స్ట్రక్టివ్ సర్జరీ పీజీ వైద్య విద్యార్థులు డాక్టర్ ప్రణయ్ కొత్తూరు, (ఆంధ్రప్రదేశ్), డాక్టర్ యహ్య . కె. పి ( కేరళ రాష్ట్రం) నుండి నేడు ఎస్ వి వైద్య కళాశాలలో అడ్మిషన్ తీసుకోవడం జరిగినది. పేద రోగులకు ఎనలేని వైద్య సేవ చేయడానికి ఇది మంచి అవకాశం అని ఈ సందర్భంగా విద్యార్థులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్ వి వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.ఏ చంద్రశేఖరన్, వైస్ ప్రిన్సిపాల్ (అడ్మిన్) డాక్టర్ వెంకటేశ్వర్లు, ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్ అధిపతి డాక్టర్ రవీంద్ర రెడ్డి, అడ్మిషన్ పొందుతున్న సూపర్ స్పెషాలిటీ ప్లాస్టిక్ సర్జరీ పి జి వైద్య విద్యార్థులు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :