Sunday, 26 July 2026 04:54:42 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

తిరుపతి అభివృద్ధి విషయంలో వెనక్కి తగ్గేది లేదు

టీటీడీ పరిపాలన భవనం వద్ద ధర్నాలో అఖిలపక్షం

Date : 26 October 2023 11:36 AM Views : 647

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : బుధవారం నాటి ఉదయం తిరుపతి అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో కన్వీనర్ టి.సుబ్రహ్మణ్యం అధ్యక్షతన టీటీడీ పరిపాలన భవనం వద్ద చేపట్టిన ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి నేతలు వందవాసి నాగరాజు, కందారపు మురళి (సిపిఎం); పి.మురళి (సిపిఐ); ఆర్.హరికృష్ణ (సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ); పి.అంజయ్య (ఆర్.పి.ఐ);ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట ఉపాద్యక్షులు వెంకటాచలపతి, తిరుపతి జిల్లా అధ్యక్షులు నీరుగట్టు నగేష్ , డిఎంసి భాస్కర్ (కాంగ్రెస్); ఆర్కాట్ కృష్ణ ప్రసాద్ (బిఆర్ఎస్) తదితరులు ప్రసంగిస్తూ.. తిరుపతి అభివృద్ధికి ఒక శాతం నిధులను టీటీడీ పాలకమండలి కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించటం ఏమాత్రం సమంజసం కాదని, బిజెపి నేతల మీడియా సమావేశాలు వీహెచ్ పి ధర్నా పోస్టర్లకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జడిసి బోర్డు ప్రతిపాదనలను తిరస్కరించడం ముమ్మాటికి తప్పేనని, హిందూ వ్యతిరేకి అనే ముద్ర జగన్ మోహన్ రెడ్డిపై పడుతుందనే భయంతో కాకుండా ప్రజల అభీష్టానికి అనుకూలంగా ఆలోచించి, తిరుపతి ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని తక్షణం తిరస్కరణపై పునఃపరిశీలన చేయాలని వారు డిమాండ్ చేశారు. టీటీడీ లాంటి ధార్మిక సంస్థ నిధులను పారదర్శకంగా ఖర్చు చేయాలని సూచించారు. 4,500 కోట్ల రూపాయల ఆదాయం ఉన్న టిటిడికి ఒక్క శాతం నిధుల కేటాయింపు పెద్ద విషయం కాదని దీనిని చట్టంగా మార్చడం ద్వారా భవిష్యత్తు అవసరాలు ఎవరి దయాదాక్షిణ్యలతో కాకుండా తిరుపతి అవసరాలు తీర్చుకోవడానికి తోడ్పడుతుందని అన్నారు. బిజెపి, ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ లాంటి అభివృద్ధి నిరోధక సంస్థలు తిరుపతి అభివృద్ధికి గత 50 ఏళ్లుగా అడ్డుపడుతూనే ఉన్నాయని గుర్తు చేశారు. తిరుపతి నగరంలో నివాసం ఉంటూనే తిరుపతికి వ్యతిరేకంగా మాట్లాడటానికి వారికి మనసు ఎలా వచ్చిందో అర్థం కావడం లేదని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రూపాయి సాయం చేయకుండా జీఎస్టీ పేరుతో టీటీడీ నుంచి దండుకుంటూ బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తిస్తున్న బిజెపి హిందువుల తరపున, శ్రీవారి భక్తుల తరపున వకాల్తా పుచ్చుకొని మాట్లాడటం నీతిమాలిన చర్యగా అభివర్ణించారు. బిజెపి అవకాశవాదాన్ని, ద్వంద్వ వైఖరిని ప్రజలు అర్థం చేసుకోవాలని, వారి మాయమాటలను, రెచ్చగొట్టే తీరును ఎప్పటికప్పుడు జాగరూకతతో గమనించాలని తిరుపతి ప్రజలకు వారు విజ్ఞప్తి చేశారు. తిరుపతి అభివృద్ధికి టీటీడీ నిధులు సాధించేంతవరకు వివిధ రూపాల్లో ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని నేతలు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు జయచంద్ర, సాయిలక్ష్మి, జి. బాలసుబ్రమణ్యం, కేఎన్ఎన్ ప్రసాదరావు, వేణు, అక్బర్, బుజ్జి, నరేంద్ర, అశోక్, జయంతి, చిన్నా, రాధాకృష్ణ, గంగులప్ప, చంద్రశేఖర్, యుగంధర్, సిపిఐ నేతలు రాధాకృష్ణ, చిన్నం పెంచలయ్య శ్రీరాములు,ఎన్ డి రవి, కవి రచయిత గొడుగు చింత గోవిందస్వామి, ఆమ్ ఆద్మీ నేతలు కోడెవాక చందు, డాక్టర్ ముద్దినేని వెంకటరమణ, బిఆర్ఎస్ నేత బెల్లంకొండ సురేష్ సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ నేతలు వెంకయ్య, వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: