Sunday, 26 July 2026 01:40:41 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం

Date : 27 June 2026 05:42 PM Views : 179

Famous TV - ఆంధ్రప్రదేశ్ / అన్నమయ్య ( రాయచోటి ) : సదుం జూన్ 27 : అన్నమయ్య జిల్లా,పుంగనూరు నియోజకవర్గం సదుం మండలంలో కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు యువతకు ముఖ్యమంత్రి చంద్రబాబు,ఉప ముఖ్యమంత్రి న్యాయం చేయాలని జనసేన పార్టీ నాయకులు కోరారు.మీడియా సమావేశంలో మాట్లాడిన జనసేన మండల అధ్యక్షులు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జనసేన పార్టీ నాయకులపై అక్రమ కేసులు నమోదు చేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు.ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నప్పటికీ సదుం ప్రాంత అభివృద్ధికి మంజూరైన ఒకటి రెండు కాంట్రాక్టు పనులను మధ్యలో నిలిపివేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. స్థానిక అధికార యంత్రాంగం ఇప్పటికీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి ప్రభావంతో వ్యవహరిస్తోందని ఆరోపించారు.జనసేన మండల ఉపాధ్యక్షులు జక్కల శ్రీకాంత్ మాట్లాడుతూ తమ గ్రామంలో తనకు కేటాయించిన కాంట్రాక్టు పనులను కూడా మధ్యలో నిలిపివేస్తున్నారని ఆరోపించారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి పార్టీ కోసం కృషి చేసిన నాయకులు,కార్యకర్తలకు న్యాయం జరగాలని కోరారు.అదేవిధంగా, టీడీపీ మైనారిటీ కార్యకర్త ఒకరు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేస్తున్నప్పటికీ తమకు చెందిన ఏడు ఎకరాల భూమిని ఇద్దరు వ్యక్తులు ఆక్రమించుకొని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై కలెక్టర్ కు రెండుసార్లు ఫిర్యాదు చేశామని, మంత్రి నారా లోకేష్ బాబు ను కూడా కలిసి సమస్య పరిష్కారం కోరామని తెలిపారు. ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతున్నా అధికారుల స్పందన లేదని వాపోయారు.సదుం మండలంలో తమకు న్యాయం జరిగేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: