Sunday, 26 July 2026 04:11:36 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

భక్తుల పై దౌర్జన్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు - మదనపల్లి డిఎస్పి మహేంద్ర

Date : 04 February 2026 08:23 PM Views : 782

Famous TV - ఆంధ్రప్రదేశ్ / అన్నమయ్య ( రాయచోటి ) : అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం,బోయకొండ గంగమ్మ భక్తులపై దౌర్జన్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మదనపల్లి డిఎస్పి మహేంద్ర తీవ్రంగా హెచ్చరించారు. ఆదివారం రోజు ఓ మహిళ భక్తురాలపై సుమో డ్రైవర్ అసభ్యకరంగా ప్రవర్తించి దౌర్జన్యం చేసిన విషయం పై బుదవారం చౌడేపల్లి సర్కిల్ పోలీస్ ఆఫీస్ నందు బోయకొండలో మాంసం కటింగ్, సుమో డ్రైవర్లు, ఆటోల డ్రైవర్ కు కౌన్సిలింగ్ ఇచ్చి పంపడం జరిగింది.బోయకొండ గంగమ్మ భక్తులపై గాని మహిళా భక్తులపై గాని చిన్న పిల్లలపై గాని ఎలాంటి గలాటాలు దౌర్జన్యాలు అసభ్యకర ప్రవర్తనలు చేస్తే తీవ్రమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.బోయకొండకు భక్తులు వస్తేనే అక్కడ ఉన్నవారికి జీవనోపాధి ఆదాయాలు ఉంటాయి కాబట్టి భక్తులపై గౌరవంగా మర్యాదగా నడుచుకోవాలని అవగాహన కల్పించారు.ప్రతి సుమో డ్రైవర్ ఆటో డ్రైవర్ మాంసం కటింగ్ చేసేవారు వారి ఆధార్ కార్డు ఫోటో ఫోన్ నెంబర్లు పోలీస్ స్టేషన్లో ఇచ్చి పోలీస్ స్టేషన్ నుంచి ప్రత్యేకమైన గుర్తింపు నెంబర్ ను తీసుకున్న వారు మాత్రమే బోయకొండలో మాంసం కటింగ్ చేసుకోవాలని ఆటోలు సుమోలు నడుపుకోవాలని ఆదేశించారు.అలాగే మహిళపై అత్యాయత్నం కూడా జరగడంతో వారిని కూడా పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరిగింది.మద్యం సేవించి ఆటోలు సుమోలు నడపడం బోయకొండలో విధులు నిర్వహించడం వ్యాపారాలు చేయడం చేసిన వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని తీవ్రంగా హెచ్చరించారు.స్థానికంగా వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉద్యోగాలు చేసేవారు మటన్ కటింగ్ చేసేవారు ప్రతి ఒక్కరూ భక్తులను మహిళలను చిన్నపిల్లలను గౌరవించడం సాంప్రదాయంగా ఉండాలని సూచించారు.ఆలయ ప్రతిష్ట దెబ్బ తినకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఆలయ ప్రతిష్ట పెంపొందించాలని సూచించారు అలాకాకుండా ఎలాంటి దౌర్జన్యాలు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయన్నారు.కౌన్సిలింగ్ కార్యక్రమంలో పుంగనూరు రూరల్ సీఐ సాయి ప్రసాద్ ,ఎస్సై నాగేశ్వరరావు ఉన్నారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: