Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : ఉత్తర్వులు జారీ చేసి వారం ఐనా సమాచారం లేదు చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : చిత్తూరు జిల్లా, చౌడేపల్లి మండలం,చారాల గ్రామానికి చెందిన ఉత్తరాది హరిప్రసాద్ గతం లో ఒక సమస్య విషయమై సెంటర్ ఫర్ ఆక్ట్స్ అండ్ రైట్స్ డెవలప్మెంట్ సొసైటీ పేరును నవంబర్ 2024 లో పెద్ద పంజాణి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి , జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు పిర్యాదు చేశారు.పిర్యాదు దారుడి సమక్షంలో విచారణ చేయాల్సిన అధికారులు పిర్యాదు దారుడికి ఎటువంటి సమాచారం లేకుండా సదరు ఫిర్యాదును పరిష్కరించినట్లు వివరణ ఇచ్చారు.ఈ సమస్య పైన సదరు పిర్యాదు దారుడు 10 మే 2025 ను సమాచారం హక్కు చట్టం 2005 ప్రకారం ఎప్పుడు విచారణ చేశారని,ఎవరి సమక్షంలో విచారణ చేశారని,ప్రభుత్వ ఉద్యోగి, ఉద్యోగి కుటుంబ సభ్యులు ఏదైనా వ్యాపారం చేయాలన్నా,ఎక్కడైనా భూములు కొనాలన్నా సంబంధిత ఉన్నతాధికారుల వద్ద అనుమతులు ఖచ్చితంగా తీసుకోవాలని సివిల్ సర్వీస్ కాండాక్ట రూల్స్ 1968 చట్టం చెబుతుంది.ఇదే ధోరణి లో సదరు ప్రభుత్వ ఉద్యోగి కుటుంబ సభ్యులు అసైన్మెంట్ భూములు కొనుగోలు చేయకూడదు.ఐతే సదరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ అసైన్మెంట్ భూములు కొనుగోలు చేసిన వారిపై చట్టరిత్యా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు సదరు ఉద్యోగిని కాపాడుటకు సమాచారం ప్రక్క దారి పట్టించారని సమాచారం హక్కు చట్టం 2005 దరఖాస్తు చేస్తే నలబై రోజుల తర్వాత జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నుండి ఉత్తర్వులు వచ్చాయి.ఈ ఉత్తర్వులు అందిన మూడురోజుల్లో సమాచారం ఇవ్వాలని ఆదేశాలు జారీచేశారు.ఐనా ఆదేశాలు వచ్చి నేటికి వారం రోజులు గడిచినా ఎటువంటి స్పందన లేదు.సమాచారం ఇవ్వడానికే ఇలా ఉంటే ఇక వీళ్ళు వైద్యం ఏవిధముగా చేస్తారో అని ఉత్తరాది హరిప్రసాద్ అన్నారు.పౌరసమాచార అధికారులు వారి విధి నిర్వహణలో జవాబుదారీ తనం, పారదర్శకత ఉంటే సమాచారం కొరకు దరఖాస్తు చేసిన నలబై రోజుల తర్వాత ఉత్తర్వులు ఇస్తారా? సంబంధిత అధికారులు వెంటనే ఇటువంటి నిర్లక్ష్యం చేస్తున్న పౌర సమాచార అధికారి పై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని ఉత్తరాది హరిప్రసాద్ డిమాండ్ చేశారు.
Admin
Famous TV