Monday, 27 July 2026 07:51:33 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

శిక్షకులు సమాజానికి మార్గదర్శకులు!

- ఎన్.బి.హర్షవర్ధన్ రెడ్డి

Date : 26 April 2024 10:07 PM Views : 781

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : శిక్షకులు సమాజానికి మార్గదర్శకులని జేసీఐ ఇండియా ఉపాధ్యక్షులు ఎన్.బి.హర్షవర్ధన్ రెడ్డి చెప్పారు. స్థానిక మానస ఇన్ హోటల్లో జరిగిన జేసీఐ ఇండియా జోన్-26 స్పీచ్ క్రాఫ్ట్ 2024ను ప్రారంభించారు. ఆయన ప్రసంగిస్తూ మన దేశానికి నాయకులు ఎంత అవసరమో, అంతకు మించి శిక్షకుల అవసరం వుందన్నారు. ఏ రంగంలో రాణించాలన్నా సరైన శిక్షణ అవసరం అన్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ శిక్షణా శిబిరానికి రాష్ట్ర నలుమూలల నుంచి 30 మంది ఎంపిక కాబడ్డారు. వీరందరూ శిక్షణ అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలలో ఉచిత శిక్షణలు నివహిస్తారు. అలాగే జేసీఐ సభ్యులకు కూడా శిక్షణ ఇస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జోన్ అధ్యక్షులు కె.కృష్ణ భాస్కర్ మాట్లాడుతూ జేసీఐ సంస్థ చేస్తున్న కార్యక్రమాల గురించి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న జేసీఐ తిరుపతి ఒడిస్సీ అధ్యక్షులు డా.ఎస్.హరిత, కార్యక్రమ చైర్పర్సన్ డా.పి.నీరజ ఇతర బృందాన్ని అభినందించారు. కీలక ఉపన్యాసకులు జి.ఎల్. మనోహర్ మాట్లాడుతూ జేసీఐ శిక్షణా రంగంలో తీసుకొచ్చిన మార్పుల గురించి, తన 30ఏళ్ల శిక్షణ అనుభూతులను పంచుకున్నారు. జోన్ ఉపాధ్యక్షులు మనోజ్ విష్ణు మాట్లాడుతూ శిక్షకులు సంస్థలకు ఊపిరి పోసేవాళ్లని తెలియజేసారు. ఈ శిక్షణా కార్యక్రమానికి విశాఖపత్నానికి చెందిన జాతీయ శిక్షకులు జయ లక్ష్మి, రాజమండ్రికి చెందిన అనంత కల్యాణి, కె.వి.ఎన్.కార్తీక్ శిక్షకులుగా ఉంటారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ చైర్పర్సన్ డా లావణ్య, ప్రాజెక్ట్ డైరెక్టర్స్ ఎన్.లలిత, మన్విత్, జేసీఐ తిరుపతి ఒడిస్సీ కార్యదర్శి కె.శ్రీదేవి, కోశాధికారి పురుషోత్తం, జేసీఐ తిరుపతి శాఖ అధ్యక్షులు టివై చైతన్య తేజ్, ఇతర నాయకులు సభ్యులు పాల్గొన్నారు.

Reporter

Reporter

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :