Sunday, 26 July 2026 06:40:31 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

తీహార్‌ జైల్లో పెట్టినా గెలుస్తా.

భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు

Date : 31 May 2023 07:14 PM Views : 412

Famous TV - ఆంధ్రప్రదేశ్ / : మాజీ మంత్రి భూమా అఖిల‌ప్రియ మరోసారి వాయిస్‌ పెంచారు. సాలిడ్‌ డైలాగ్స్‌తో హీట్‌ పుట్టించారు. అన్నింటికీ సిద్ధమయ్యే రాజకీయాల్లోకి వచ్చానన్న అఖిల‌ప్రియ.. తనను తీహార్ జైల్లో వేసినా.. జైలు నుంచి నామినేషన్ వేసి గెలుస్తానని సవాల్‌ విసిరారు. మాజీ మంత్రి భూమా అఖిల‌ప్రియ చేసిన వ్యాఖ్యలు సంచ‌లనంగా మారాయి. తనను ప్రజల్లోకి వెళ్లకుండా, ప్రజల మధ్య తిరగకుండా అడ్డుకొనేందుకు కుట్ర పన్ని తనపై కేసులు పెట్టారని ఆరోపించారు. ఏవీ సుబ్బారెడ్డి చున్నీ లాగారంటూ ఫిర్యాదు చేస్తే తనను మాత్రమే అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే హోం మంత్రి పదవిని మహిళకే ఇవ్వాలని కోరారు. తనను తీహార్‌ జైల్లో పెట్టినా పోటీ చేసి గెలుస్తానని, అన్నింటికీ సిద్ధమయ్యే రాజకీయాల్లోకి వచ్చినట్లు భూమా స్పష్టం చేశారు. ఏవీ సుబ్బరెడ్డి పార్టీలో ఉంటే.. ఈ నాలుగు సంవత్సరాలు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు అఖిలప్రియ. పార్టీలో ఉన్న గుంట నక్కల గురించి నారా లోకేష్ చూసుకుంటారన్నారు. ఎన్ని కేసులు పెట్టినా.. ఆళ్ళగడ్డ ప్రజలకు అండగా ఉంటానని స్పష్టం చేశారు. నంద్యాలలో మీడియాతో మాట్లాడిన ఆమె పోలీసులు తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కొంతకాలంగా అఖిలప్రియ, సుబ్బారెడ్డి వర్గాల మధ్య వర్గపోరు నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్తపల్లి వద్ద ఇరు వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. ఆ తర్వాత ముదిరింది. అఖిలప్రియ మద్దతుదారుడు సుబ్బారెడ్డిపై దాడి చేయడంతో ఆయన ముక్కు నుంచి రక్తం కారింది. ఇది ఉద్రిక్తతకు దారితీసింది. ఏవీ సుబ్బారెడ్డిపై దాడి కేసులోనే అఖిలప్రియను పోలీసులు అరెస్ట్ చేశారు. నారా లోకేశ్ సమక్షంలోనే టీడీపీ నేతలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకోవడం పార్టీ శ్రేణుల్లో కలకలం రేపింది. అప్పట్లో దీనిపై పార్టీ అధినేత చంద్రబాబు సైతం సీరియస్ అయ్యారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: