Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : చిత్తూరు జిల్లా, చౌడేపల్లి మండలంలో ని ఆమినిగుంట గ్రామపంచాయితీ సింగిరిగుంట గ్రామమునకు చెందిన యం.ప్రకాష్ నాయుడు, పి.చెన్న కృష్ణ, డి.సుజాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతామని గత రెండు మూడు రోజులుగా మాతో సంప్రదింపులు జరిపినారు.ఆదివారం తంబళ్లపల్లె శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి తంబళ్లపల్లె పర్యటనకు వెళ్తున్న సమయంలో మా కోరిక మేరకు వారికి సింగిరిగుంట గ్రామంలో మా పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.అదే సమయంలో పరికిదొన పంచాయతీకి చెందిన నాగరాజు నాయుడు, సింగిరిగుంటకు చెందిన నరేష్ నాయుడు, రాజశేఖర్ నాయుడులను మా కార్యక్రమానికి తీసుకువచ్చి మేము వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతామని మాకు కండువా వేసి ఆహ్వానించవలసినదిగా కోరినారు. మీరు ఎందుకు మా పార్టీ లో చేరుతున్నారని అడుగగా వారు ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా వారి దౌర్జన్యాలను, వారి డ్రామాలు చూడలేక వచ్చామని సమాధానం ఇచ్చారు.ఐతే ఈ ముగ్గురిని తెలుగుదేశం పార్టీ నాయకులు మా దగ్గరకు పంపించి డ్రామాలు ఆడించి కొద్ది గంటల సమయంలో తిరిగి పార్టీలోకి వచ్చినట్లు ప్రకటించుకున్నారు.మేము ఎవరిని మభ్య పెట్టవలసిన అవసరం లేదు వాళ్లేమి చిన్నపిల్లలు కాదు ఎవరిని బలవంత పెట్టి పార్టీలో చేసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అని వైకాపా మండలాధ్యక్షులు నాగభూణ రెడ్డి తెలియజేశారు..వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల మద్దతు రోజురోజుకు పెరుగుతుండడం గమనించి తెలుగుదేశం పార్టీ నాయకులు జీర్ణించుకోలేక మేము మోసం చేసినాము, మభ్యపెట్టినామని ఆవాకులు చేవాకులు పేలుస్తున్నారు. అలాంటి అవసరం మా పార్టీకి లేదని ఆయన తెలియజేస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Admin
Famous TV