Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : రేణిగుంట మండలం కరకంబాడి నందు గల అమర రాజా విద్యాలయం లో బుధవారం ఘనంగా జాతీయ సైన్స్ డే దినోత్సవాలు ఘనంగా జరిగాయి, ఈ వేడుకలను ఉద్దేశించి ప్రిన్సిపల్ గ్లోరీ దేవ ప్రియ మాట్లాడుతూ "రామన్ ఎఫెక్ట్ కనిపెట్టిన శాస్త్రవేత్త ప్రతిష్టాత్మక నోబెల్ విజేత చంద్రశేఖర్ వెంకటరామన్ భౌతిక శాస్త్రంలో చేసిన అపార సేవలకు గుర్తుగా ప్రతి ఏట ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ దినోత్సవంగా నిర్వహిస్తారని, కొత్త ఆవిష్కరణ పరిశోధనల లో కొత్త ఆలోచనలు కీలక పాత్ర పోషిస్తాయని, జీవితంలో సైన్స్ కీలకమని విద్యార్థులకు తెలియజేశారు". ఈ సందర్భంగా విద్యార్థులు పర్యావరణం కోసం జీవనశైలి అనే నినాదంతో తయారుచేసిన సైన్స్ నమూనాలను ప్రదర్శించి పలువురి అభినందనలు పొందారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ జయంతి, ఉపాధ్యాయులు , విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Admin
Famous TV