Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చిత్తూరు ,తవణంపల్లి మండలం, దిగువమాఘం లో అక్టోబర్ 21,10,2023: మాజీ ఎంపీ కీ.శే శ్రీ. పాటూరు రాజగోపాల్ నాయుడు గారి 26వ వర్ధంతి సందర్భంగా అమర రాజా వ్యవస్థాపక చైర్మన్ శ్రీ. గల్లా రామచంద్ర నాయుడు, మాజీ మంత్రి వర్యులు గల్లా అరుణ కుమారి గారు తవనంపల్లి మండలం దిగువమాఘం గ్రామం నందు గల రాజన్న మెమోరియల్ పార్క్ నందు శ్రీ. రాజగోపాల్ నాయుడు గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం లో మండల గౌరవ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వేణుగోపాల్ నాయుడు, మాజీ ZPTC వెంకటేష్ చౌదరి ,దిగువమాఘం సర్పంచ్ గోపి,మాజీ సర్పంచ్ కుమార్ నాయుడు , రాజన్న ఫౌండేషన్ నిర్వాహకులు సతీష్, యల్లంపల్లి సురేష్ గారు మరియు గల్లా అభిమానులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Admin
Famous TV