Monday, 27 July 2026 07:49:32 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

ప్రజా జీవితాన్ని శోధించి రాయలు రాసిందే ఆముక్తమాల్యద - డా॥సంగనభట్ల నరసయ్య

Date : 24 August 2023 09:52 PM Views : 693

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తెలుగు అధ్యయన శాఖ యస్వీయూ సెనేట్ హాల్లో నిర్వహించిన “ఆచార్య కె సర్వోత్తమరావు ధర్మనిధి ఉపన్యాసం” చేయడానికి , కరీంనగర్‌ జిల్లా ధర్మపురి నుండి డా॥ సంగనభట్ల నరసయ్య ముఖ్య ఉపన్యాసకులుగా వచ్చారు. ఈ సభకు ముఖ్య అతిథిగా వచ్చిన యస్వీయూ రిజిస్ట్రార్ ఆచార్య మహమ్మద్ హుస్సేన్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో 1954 నుండి తెలుగు విభాగం గొప్ప ఆచార్యలుతో విలసిల్లడం , వారు రాసిన పుస్తకాలు తెలుగు చదివే వారికి కర దీపికలు కావడం తనకు తెలుసునని అన్నారు. సంగనభట్ల వారు “ఆముక్తమాల్యద వైశిష్ట్యం” పై మాట్లాడుతూ ప్రపంచంలో శ్రీకృష్ణదేవరాయల వంటి చక్రవర్తి లేరని, ఏ రాజు గొప్ప కవిగా రాణించలేదని అన్నారు.రాయలు అచ్చంగా తెలుగు వాడని, కన్నడీకుడు కాదని,వారు జీవిత కాలమంతా శోధించి, ప్రజాజీవితాన్ని,కవిత్వ సారాన్ని తన ఆముక్తమాల్యదలో ఇమిడ్చి ప్రౌఢ ప్రబంధంగా రాశారని అన్నారు. రాయలు ఆరు సంస్కృత గ్రంథాలు రాసిన విషయం చాలామందికివతెలియదని, వారి జాంబవతీ పరిణయం చదవమని చెప్పారు. రైతులు , వ్యాపారులు, ఆటవీప్రాంత వాసుల జీవితం ఆముక్తమాల్యదలో వుందని,దానిని లోతుగా చూడమన్నారు. ఈ సభకు అధ్యక్షత వహించిన శాఖాధ్యక్షులు ఆచార్య రాజేశ్వరమ్మ ముఖ్యవక్త పాండిత్యాన్ని, పరిశోధనల తత్త్వాన్ని వివరించగా, ఆచార్య పేట శ్రీనివాసులు రెడ్డి ధర్మనిధి ఉపన్యాసం నేపథ్యాన్ని వివరించారు. డా॥ ఆదిశేషయ్య అతిథులను వేదికపైకి ఆహ్వానించగా, డా॥ అశోక్ వందన సమర్పణ చేశాడు. తెలుగు శాఖ పూర్వ ఆచార్యులు, పరిశోధకులు విద్యార్థులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: