Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : శ్రీ ద్రౌపతి దేవి సమేత శ్రీ ధర్మరాజ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవముల సందర్భంగా శ్రీకాళహస్తి తొట్టంబేడు మండలం లారీఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ద్రౌపతి సమేత ధర్మరాజు స్వామి వారి ఆలయం ప్రాంగణం లో ప్రతి సంవత్సరం నిర్వహించే అన్నదాన కార్యక్రమాన్ని శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూర్ తారక శ్రీనివాసులు గారు ముఖ్య అతిధులు గా పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీ ద్రౌపతి దేవి సమేత శ్రీ ధర్మరాజ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవముల సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహించే అన్నదాన కార్యక్రమాన్ని శ్రీకాళహస్తి తొట్టంబేడు మండలం లారీఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు చాలా సంతోషకరమైనది అనీ తెలియజేశారు. లారీఓనర్స్ అసోసియేషన్ సభ్యులకి అందరికీ తల్లి జ్ఞాన ప్రసూనాంబికా దేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల చల్లని దీవెనలు ఎల్లప్పుడూ మీకు మీ కుటుంబ సభ్యులు ఉండాలని కోరుకుంటున్నాను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు పాలమంగళం రవి, లారీ ఓనర్స్ అసోసియేషన్ మెంబర్స్ సుబ్రహ్మణ్యం, చిరంజీవి రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, తదితర లారి ఓనర్స్ పాల్గొన్నారు.
Admin
Famous TV