Sunday, 26 July 2026 06:46:18 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

మామిడి తోటను ధ్వంసం చేసి నష్టపరచిన ఏనుగులు

Date : 16 June 2025 05:24 PM Views : 491

Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : పలమనేరు ఫేమస్ టీవి న్యూస్ : చిత్తూరు జిల్లా,పలమనేరు మండలం లోని మొసలి మడుగు గ్రామ సమీపంలో ఆదివారం రాత్రి అడవిలో నుంచి వచ్చిన గుంపు ఏనుగులు గ్రామానికి చెందిన ఉమాపతి నాయుడు అనే రైతుకు చెందిన కోత దశలో ఉన్న ఐదు ఎకరాల మామిడి తోటలోనికి ప్రవేశించి కోత దశలో ఉన్న నాలుగు ఎకరాల్లో మామిడి కొమ్మలను విరిచేసి అందులోని కాయలను ఆరగించి మిగిలిన కాయలను నేలపాలు చేసి కాళ్ళతో తొక్కి పూర్తిగా నష్టపరచడమే కాకుండా ఎండకు వర్షానికి దాపుగా వేసుకున్న చిన్న గుడిసెను కూడా ధ్వంసం చేశాయి. ఈ నష్టమైన నాలుగు ఎకరాల మామిడి తోట సుమారు మూడు లక్షల రూపాయలు నష్టం జరిగిందని రైతు ఆవేదనతో వాపోయారు. అదేవిధంగా పక్కనున్న రైతు గిరిజ అనే రైతు పొలంలో వేసిన వారి మడిని తొక్కి అక్కడున్న కొబ్బరి చెట్లను విరిచేసి నష్టపరిచాయి ఈ విషయాన్ని అటవి శాఖ అధికారులకు తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్న ఫారెస్ట్ రమేష్ మరియు బీట్ ఆఫీసర్ యుగంధర్ తదితరులు వచ్చి ఏనుగుల వలన నష్టమైన మామిడి ఇతర తోటను పరిశీలించి రైతులకు నష్టమైన పంటలను ప్రభుత్వానికి పంపి ప్రభుత్వం ద్వారా రైతులకు తగిన నష్టపరిహారం తప్పక ఇప్పిస్తామని రైతులకు సర్ది చెప్పి పంచనామా పత్రాన్ని రైతులకు అందజేశారు. రైతులు పంటపెట్టుబడులకు లక్షలాది రూపాయలు అప్పులు చేసి వేసిన పంటలు చేతికొచ్చే సమయంలో ప్రతి యేటా ఏనుగుల వలన వేసిన పంటలు పూర్తిగా నష్ట పోతూనే ఉన్నాయి ఈ మద్య కాలంలో ఏనుగులు రాలేదు కానీ ప్రస్తుతం మామిడి సీజన్ కాబట్టి ఇప్పుడు మళ్ళీ మొదలైనాయి గత వారం రోజులుగా ఏదో ఒక చోట నష్టం చేస్తున్నాయి అటవి శాఖ అధికారులు వారి సిబ్బంది కూడా ప్రతి నిత్యం పొలాల వద్ద ఉంటున్నా కూడా మరోవైపున వస్తున్నాయి.రాత్రి కూడా ఇందిరానగర్ వైపు వస్తాయని అక్కడ నిఘా ఉన్నారు. కానీ మరోవైపు నుంచి వచ్చిన ఏనుగులను గమనించ లేకపోయారు కానీ మామిడి కోతల సీజన్లో రాత్రికి కూడా ఏనుగులు మళ్ళీ వచ్చి నష్ట పరుస్తాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకపై ఏనుగులు పంటపొలాలపై రాకుండా వాటిని అదుపు చేసి అడవికి ఆనుకుని వున్న ప్రాంతాల్లో సోలార్ ఫెన్సింగ్ వెంటనే ఏర్పాటు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: