Sunday, 26 July 2026 01:40:28 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం!

Date : 22 July 2026 08:16 PM Views : 228

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : సత్వరం మామిడి బోర్డు ఏర్పాటు చేయండి. * మామిడి రైతుల సదస్సులో * రైతు సంఘాల నేతలు ఎ. రామానాయుడు డా. టి.. జనార్దన్. మునీశ్వర్ రెడ్డి. ఉమాపతి నాయుడు తిరుపతి కలెక్టరేట్: ప్రపంచ మామిడి దినోత్సవం సందర్భంగా ఎపి రైతు సంఘం ఆధ్వర్యంలో తిరుపతిలోని గంధమనేని శివయ్య, కృష్ణారెడ్డి భవన్‌లో ఉమ్మడి చిత్తూరు. అన్నమయ్య.తిరుపతి జిల్లాల మామిడి రైతుల సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, గిట్టుబాటు ధర కల్పన, మార్కెటింగ్‌లో ఉన్న ఇబ్బందులు,ప్రభుత్వ సహకారంపై, రైతులకు న్యాయమైన ధర కల్పించేందుకు ప్రభుత్వం తీసుకోవలసిన తక్షణ చర్యలపై పలువురు రైతు నేతలు ప్రసంగించారు.. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ. రామానాయుడు మాట్లాడుతూ., మామిడి రైతులకు గిట్టుబాటు ధర హామీతో పాటు,ప్రత్యేక మామిడి బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని, మామిడి రైతులకు కేంధ్రం ప్రకటించిన రు 17.47 మద్దతు ధర మేరకు కొనుగోలు చేయని ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలపై చర్యలు తీసుకోవాలని కోరారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు పెట్టుబడి వ్యయంపై లాభదాయక ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు.మామిడి రైతులు తీవ్ర నష్టాలతో అప్పుల పాలవుతున్నారని పేర్కొన్నారు.. ఉపాధి హామీ పథకాన్ని మామిడి ఇతర ఉద్యాన పంటలను పూర్తి అనుసంధానం చేయాలని,ప్రతి మార్కెట్ యార్డులో కోల్డ్ స్టోరేజీలు,సోలార్ డ్రై యూనిట్లు, సహకార రంగంలో పల్ప్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయాలని సూచించారు.ప్రత్యేక మామిడి బోర్డు ఏర్పాటుతో రైతులకు సాంకేతిక మార్గదర్శకత్వం,ధరల స్థిరీకరణ, ఎగుమతుల ప్రోత్సాహం,నాణ్యత ప్రమాణాల అమలుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా రైతు సంఘం సీనియర్ నాయకులు డా. టి.. జనార్ధన్, మునీశ్వర్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ., మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సుమారు 2.80 లక్షల ఎకరాల్లో మామిడి సాగు జరుగుతుండగా, అధికంగా తోతాపురి రకం పండిస్తున్న రైతులు తీవ్ర ఇబ్బందులు,నష్టాలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.గతంలో మామిడి పల్ప్ పరిశ్రమలు పెరగడంతో రైతులకు ప్రయోజనం కలుగుతుందని భావించినప్పటికీ, ప్రస్తుతం ఫ్యాక్టరీలు, ర్యాంపుల వ్యవస్థ వల్ల రైతులు నష్టపోతున్నారని విమర్శించారు. ప్రభుత్వం ప్రకటించే ధరలు అమలుకావడం లేదని, గత ఏడాది ప్రకటించిన సబ్సిడీ కూడా రైతులందరికీ పూర్తిగా అందలేదని ఆరోపించారు. రాయలసీమను ఉద్యాన హబ్‌గా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ, ఎగుమతులకు అవసరమైన సాంకేతిక సహాయం,శాస్త్రీయ మార్గదర్శకాలు, అధికార యంత్రాంగం నుంచి సహకారం అందడం లేదన్నారు. టేబుల్ వెరైటీ మామిడి పండ్లను అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేసే అవకాశాలు ఉన్నప్పటికీ, రైతులకు అవసరమైన అవగాహన,శిక్షణా కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని తెలిపారు.మామిడి బోర్డు ఏర్పాటు చేసి రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని, గిట్టుబాటు ధర అమలును కట్టుదిట్టంగా పర్యవేక్షించాలని, ర్యాంపుల వద్ద జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని, మామిడి ఉత్పత్తుల ఎగుమతులకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వాన్ని సమావేశం ద్వారా డిమాండ్ చేశారు. సిపిఐ జిల్లా కార్యదర్శి పి.మురళి మాట్లాడుతూ., మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించి, దళారీ వ్యవస్థను అరికట్టాలని, రైతుల సమస్యల పరిష్కారానికి రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి జిల్లాలోని మామిడి ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలు కుమ్మక్కై తక్కువ ధరలకు పంట కొనుగోలు చేయడం, దళారీ వ్యవస్థ వలన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఐక్యంగా ఉంటేనే ప్రభుత్వాలు, యాజమాన్యాలు స్పందిస్తాయని పేర్కొన్నారు. మామిడి సీజన్‌కు ముందుగానే ఉద్యమ కార్యాచరణ ప్రారంభించి, కలెక్టర్ ఆధ్వర్యంలో ఫ్యాక్టరీ యాజమాన్యాలతో సమావేశం నిర్వహించి గిట్టుబాటు ధర నిర్ణయించాలని కోరారు. రైతులందరూ ఐక్యంగా ఉంటేనే శాశ్వత పరిష్కారం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఉమాపతి నాయుడు మాట్లాడుతూ., మామిడి,బొప్పాయి సహా ఇతర ఉద్యాన పంటలు సాగు చేసినా రైతులకు నష్టాలే మిగులుతున్నాయని, ప్రభుత్వం రైతుల సమస్యలను విస్మరిస్తోందని విమర్శించారు. వ్యవసాయ భూములను ఇతర అవసరాలకు స్వాధీనం చేసుకోవడం అభివృద్ధి కాదని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే నిజమైన అభివృద్ధి అని అన్నారు.కరోనా సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థను రైతులే నిలబెట్టారని గుర్తు చేస్తూ, సహకార సంఘాల ద్వారా రైతులు ఐక్యంగా మార్కెటింగ్ వ్యవస్థను బలోపేతం చేసుకోవాలని సూచించారు.రైతులకు గిట్టుబాటు ధరతోపాటు పెట్టుబడి భారం తగ్గించే చర్యలు వెంటనే చేపట్టి ప్రకృతి వైపరీత్యాల వలన సంభవించే అకాల భారీ వర్షాలు ఈదురు గాలులకు నష్టపోయిన మామిడి రైతులకు ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఎలాంటి నష్టపరిహారం ఇవ్వలేదని చెప్పారు ఇప్పటివరకు నష్టపోయిన మామిడి రైతులకు ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు రైతు సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షులు జి.మునిరత్నం మాట్లాడుతూ., మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, గిట్టుబాటు ధరలు లేకపోవడం, సాగు వ్యయాలు పెరగడం వల్ల మామిడి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు లాభదాయకంగా ఉన్న మామిడి సాగు ప్రస్తుతం నష్టాల బాట పట్టిందని, పలువురు రైతులు తోటలను తొలగించే పరిస్థితి ఏర్పడిందన్నారు. మామిడి రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు గిట్టుబాటు ధర, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయం నేత డా.గంగాధరం,రైతు సంఘం నేతలు, వంగిమళ్ళ రంగారెడ్డి,, సుధాకర్ రెడ్డి,మునిరత్నం నాయుడు, బి.శ్రీనివాసులు, జె. గురవయ్య,వెంకటరత్నం నాయుడు, మున్వర్ భాష, పద్మనాభ రెడ్డి, జయదేవయ్య,చంగల్రా య రెడ్డి, హేమలత. భారతి,త్యాగరాజ రెడ్డి, సందీప్,సంజీవ్ రెడ్డి, సూరి,శివారెడ్డి తోపాటు రైతు నాయకులందరికీ సన్మాన కార్యక్రమాలు నిర్వహించి ఈ కార్యక్రమానికి సుమారు 150 మంది రైతులు పాల్గొన్నారు

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: