Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం లో వైసీపీ పార్టీ ఖాళీ అయ్యిందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇది నిజమే అంటూ కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. వైసీపీ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కుప్పంలో సర్వ వేగంగా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. వైసిపి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత, తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం జరిగిబ. గత కొన్ని రోజులుగా కుప్పం మున్సిపాలిటీ గురించి జరుగుతున్న చర్చలకు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా కుప్పం లో ఉన్న మున్సిపాలిటీ కౌన్సిలర్లు కొంతమంది తెదాపాలో చేరడం జరిగింది. కుప్పం పార్టీ కార్యాలయం ను ఖాళీ చేయడంతో ఆ స్థలంలో యజమాని హోటల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది.
Admin
Famous TV