Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : ప్రజల సమస్యలకు పరిష్కార వేదికగా స్పందన కార్యక్రమం... స్పందన ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం చేయకండి. సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్.పి శ్రీ Y.రిషాంత్ రెడ్డి, IPS. స్పందన కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, నిర్దేశించిన గడువులోగా ఫిర్యాదు దారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను జిల్లా ఎస్.పి శ్రీ Y.రిషాంత్ రెడ్డి, IPS గారు ఆదేశించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు నేరుగా ఎస్.పి గారిని అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీ ఎల్.సుధాకర్ మరియు అడిషనల్ ఎస్పీ SEB శ్రీమతి శ్రీలక్ష్మి గారిని కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ ఫిర్యాదులకు స్పందిస్తూ త్వరిత గతిన విచారణ జరిపి ఫిర్యాదు దారులకి న్యాయం చేయాలని సంభందిత అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 17 ఫిర్యాదులు అందాయి, వాటి వివరాలు... ఇంటి తగాదాలు – 2, చీటింగ్ – 3, కుటుంబ తగాదాలు – 4, వేదింపులు – 1, ఆస్తి తగాదాలు – 2, భూ తగాదాలు – 5.
Admin
Famous TV