Sunday, 26 July 2026 07:42:51 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

యువన్యాయవాదులకు తొలి 3 సంవత్సరాలు అండగా ఉంటూ, ఊతమిస్తూ 2023–24 సంవత్సరానికి మొదటి విడత వైఎస్సార్‌ లా నేస్తం

Date : 26 June 2023 03:46 PM Views : 755

Famous TV - ఆంధ్రప్రదేశ్ / ఎన్టీఆర్ ( విజయవాడ ) : రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన 2,677 మంది జూనియర్‌ న్యాయవాదుల ఖాతాల్లో నెలకు రూ.5000 స్టైఫండ్‌ చొప్పున ఫిబ్రవరి 2023 – జూన్‌ 2023 (5నెలలు)కు ఒక్కొక్కరికి రూ.25,000 ఇస్తూ మొత్తం రూ. 6,12,65,000ను క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి జమ చేసిన సీఏం శ్రీ వైయస్‌.జగన్‌. ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే....: దేవుడి దయతో ఈ రోజు ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది. గత నాలుగు సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ ఏడాదికి సంబంధించి ఈ దఫా దాదాపుగా 2,677 మంది అడ్వకేట్‌ చెల్లెమ్మలకు, తమ్ముళ్లకు మంచి చేస్తూ రూ.6,12,65,000 వారి అకౌంట్ల్‌ జమ చేస్తున్నాం. వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేందుకు తోడుగా... ఇది ఒక మంచి ఆలోచన, మంచి కార్యక్రమం. న్యాయవాదులు లా కోర్సు పూర్తిచేసిన, మొదటి మూడు సంవత్సరాల్లో ప్రాక్టీసు పరంగా నిలదొక్కుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే చదువులు పూర్తి అయి, కోర్టుల్లో అడుగుపెడుతున్న పరిస్థితుల్లో వారి కాళ్లమీద వాళ్లు నిలబడేందుకు, వారికి తోడుగా నిలుస్తూ ప్రతి నెలా రూ.5వేలు, ఏడాదిలో రూ.60వేలు ఇస్తున్నాం. మూడేళ్లలో ఇలా ఒక్కొక్కరికీ రూ.1.80లక్షలు ఇస్తున్నాం. దీనివల్ల వృత్తిలో వాళ్లు నిలదొక్కుకుంటారు.ఇబ్బంది పడకుండా జీవితంలో ముందుకు వెళ్తారు అన్న మంచి ఆలోచనతో ఈ పథకం ప్రారంభించాం. 4 ఏళ్లలో 5,781 మందికి రూ.41.52 కోట్లు సాయం. ఇప్పటివరకూ 5,781 మంది జూనియర్‌ న్యాయవాదులకి మేలు చేశాం. 2019 నవంబరులో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో నాలుగేళ్లలో ప్రతి నెలా రూ.5వేల చొప్పున ఇస్తూ.. ఇంతవరకూ మొత్తంగా రూ. 41.52 కోట్లు జూనియర్‌ లాయర్లకు ఇచ్చాం. రూ.100 కోట్లతో వెల్ఫేర్ ట్రస్టు... ఇలాంటి పథకం, ఇలాంటి ఆలోచన దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. కేవలం మన రాష్ట్రంలో మాత్రమే జరుగుతుంది. ఇదొక్కటే కాకుండా అడ్వకేట్లకు అన్నిరకాలుగా మంచి జరగాలనే ఉద్దేశంతో రూ.100 కోట్లతో అడ్వకేట్‌ జనరల్‌ ఆధ్వర్యంలో ఇప్పటికే వెల్ఫేర్‌ ట్రస్టును ఏర్పాటు చేశాం. మెడిక్లెయిం కాని, న్యాయవాదుల అవసరాలకు రుణాలు వంటివాటికి, ఈ ఫండ్‌ నుంచి రూ.25 కోట్లు సహాయం చేయడం జరిగింది. ఈ రెండు కార్యక్రమాల ద్వారా నాలుగేళ్ల కాలంలో అడ్వకేట్లకు రాష్ట్ర ప్రభుత్వం నిజంగా తోడుగా ఉందనే సంకేతం వెళ్లింది. పేదల పట్ల మమకారం చూపండి. ఇంత మనసు పెట్టి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ప్రభుత్వం తరపు నుంచి న్యాయవాదులను కోరేది ఒక్కటే. జూనియర్లుగా ఉన్న న్యాయవాదులు ప్రతి ఒక్కరికీ కూడా దీనివల్ల మంచి జరిగితే.. వీరు స్థిరపడ్డాక ఇదే మమకారం వీళ్లు పేదలపట్ల చూపిస్తారని ఒక విశ్వాసం. ప్రభుత్వం తరపు నుంచి ఒక అన్నగా, ఒక స్నేహితుడిగా వారి దగ్గరనుంచి నేను ఆశిస్తున్నది ఇదే. దేవుడి దయ వల్ల మంచి జరుగుతుంది. దీన్ని ఎప్పుడూ మరిచిపోవద్దని కోరుతున్నాను. ఈ మంచిని ప్రతి పేదవాడికి తిరిగి బదిలీ అయ్యేటట్టుగా గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నాను. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి సంబంధించి డిసెంబరు నాటికి ఆరునెలలు అవుతుంది. 6 నెలలకు ఒకేసారి మొత్తంగా రూ.30వేలు వస్తే.. ఇంగా బాగా ఉపయోగపడుతుందన్న ఉద్దేశ్యంతో క్రితంసారి మార్పు చేశాం. మరలా డిసెంబరులో ఈ ఏడాదికి సంబంధించిన రెండో దఫా కార్యక్రమం జరుగుతుంది. వీటన్నింటివల్లా న్యాయవాదులకు మంచి జరగాలని కోరుకుంటున్నాను అని సీఎం ప్రసంగం ముగించారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: