Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : బుధవారము ఎస్. వి వైద్య కళాశాలలో మహిళా వైద్యుల సీనియర్ రెసిడెన్సి హాస్టల్ నూతన భవనమును ప్రారంభించిన తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి, ఎస్వీ వైద్య కళాశాల అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖరన్ ఆధ్వర్యంలో మహిళా వైద్యుల రెసిడెన్స్ నూతన భవనం ప్రారంభిస్తూ మనకు స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ పేద రోగుల కొరకు ఇలాంటి సీనియర్ రెసిడెన్సులు ఎంతైనా అవసరం ఉందని ఈ సందర్భంగా తెలిపారు. సీనియర్ రెసిడెన్సు కు హాస్టల్ వసతి కల్పించినట్లయితే ఎల్లవేళల అందుబాటులో ఉంటారని ఆయన అన్నారు.
తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ ఈ వైద్య కళాశాలలో చదువుకున్న నేను పీజీ మహిళా రెసిడెన్షియల్ హాస్టల్ ను ప్రారంభించడం ఎంతో సంతోషదాయకంగా ఉందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ వైద్య కళాశాలకు ప్రభుత్వం తరఫునుంచి రావలసిన అన్ని వసతులను గౌరవనీయులైన శాసనసభ్యుల ద్వారా తీసుకురావడానికి ఎల్లవేళలా కృషి చేస్తామని తెలిపారు. రుయా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ జి.రవి ప్రభు మాట్లాడుతూ వసతి గృహం వలన మహిళా వైద్యులు మనకు అందుబాటులో ఉంటారని, మెరుగైన వైద్యం అందించడంలో పేద రోగులకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఆయన అన్నారు
ఈ కార్యక్రమానికి డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, 23 వ వార్డు డివిజన్ కార్పొరేటర్ రామస్వామి వెంకటేశ్వర్లు, రుయా ఆసుపత్రి డెవలప్మెంట్ వైస్ చైర్మన్ బండ్ల చంద్రశేఖర్, ఏపీ ఎమ్మెస్ ఐ డి సి, ఎస్.ఈ. కృష్ణారెడ్డి, ఈ. ఈ. లక్ష్మీపతి రెడ్డి, డి.ఈ. రమణమూర్తి , స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్ ముని మోహన్ రెడ్డి, ఎస్ వి వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ (అడ్మిన్) డాక్టర్ వెంకటేశ్వర్లు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వసుంధర దేవి (అకాడమిక్ ), డాక్టర్ యువఅవినాష్, హాస్పిటల్ అడ్మిన్ ఉమామహేశ్వరరావు, మరియు ఎస్వీ వైద్య కళాశాల పిఆర్ఓ వీర కిరణ్ పాల్గొన్నారు.
Admin
Famous TV