Sunday, 26 July 2026 04:54:12 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

తిరుపతి ఎం.పి గురుమూర్తి పోటీపై ఉహాగానాలొద్దు...!

తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి రానున్న ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశం పై అనవసర ఊహాగానాలను కొట్టి పారేసిన రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి

Date : 01 October 2023 01:53 PM Views : 591

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : తిరుపతి ఎం.పి డాక్టర్ గురుమూర్తి రానున్న ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశం పై అనవసర ఊహాగానాలకు తెరదించాలని వై.సి.పి దక్షిణ కోస్తా జిల్లాల సమాన్వయకర్త విజయసాయి రెడ్డి కోరారు. తిరుపతి జిల్లా పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల వైసిపి నాయకులతో రెండు రోజుల పాటు విజయసాయి రెడ్డి నేతృత్వంలో సమీక్ష సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో తిరుపతి ఎంపి గురుమూర్తి పోటీ పై అసక్తికర వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. రానున్న ఎన్నికల్లో తిరుపతి ఎంపి గా డాక్టర్ గురుమూర్తి పోటీ చేయరనే ప్రచారాన్ని ఆయన కొట్టి పారేసారు. తిరుపతి లోకసభ నియోజకవర్గ పరిధిలో మూడు ఎస్సీ రేజర్వ్డ్ స్థానాల్లో ఎదో ఒక చోట నుంచి డాక్టర్ గురుమూర్తి పోటీ చేస్తారనే ప్రచారం తన దృష్టికి వచ్చిందని విజయసాయి రెడ్డి అన్నట్టు సమాచారం.అయితే ఆ ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదన్నారు. అలాంటి ఊహాగానాలకు తెరదించాలని ఆయన కోరారు.

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో నమ్మకంతో అత్యున్నత చట్ట సభకు గురుమూర్తిని పంపారని. ముఖ్యమంత్రి నమ్మకాన్ని గురుమూర్తి వమ్ము చేయలేదన్నారు. తనకు అప్పగించిన బాధ్యతలను గురుమూర్తి విజయవంతంగా నిర్వర్తిస్తూ,మంచి పార్లమెంటేరియన్ గా పేరు తెచ్చుకున్నారని కితాబిచ్చారు. తిరుపతి ఎంపి గా గురుమూర్తినే పోటీ చేయించాలనేదే తన అభిమతమన్నారు.

ఇదే విషయాన్ని సిఎం దృష్టికి తీసుకెళ్లి,మళ్ళీ తిరుపతి లోకసభ బరిలో డాక్టర్ గురుమూర్తినే నిలిపేలా చేస్తామని ఆయన అన్నారు. కావున గురుమూర్తి ఎంఎల్ఏ గా పోటీ చేస్తారనే ప్రచారాన్ని పక్కన పెట్టి ఆయన్ను మరోసారి ఎంపి గా చూసేందుకు అందరూ కృషి చేయాలని విజయసాయి రెడ్డి అన్నారు

A.Vinay Kumar

Reporter

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: