Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : చిత్తూరు జిల్లా, చౌడేపల్లి మండలం, దిగువపల్లి గ్రామ పంచాయతీ లో వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రం బోయకొండ గంగమ్మ దేవస్థానం లో చిన్నబోగం, పెద్దబోగం సమర్పించే చోట భక్తులను నిలువునా దోచుకుంటున్నారు. గతం లో చిన్న తల ఐతే నాలుగు వందలు, పెద్దతల ఐతే ఏడు వందలు అమ్ముచుండేవారు, ఐతే ప్రస్తుతం అమ్మవారి బలిపీఠం వద్ద కాంట్రాక్టర్ చెప్పినదే రేటు అన్నట్లుగా ఉంది.చిన్నతల పన్నెండు వందలు, పెద్దతల పదిహేడు వందలు అమ్ముతున్నారు. ఇది ఏమని అడిగితే మాకేమి ఊరికే రాలేదు,కోట్లు ఖర్చు పెట్టి వేలం పాట పాడాము, మేము సంపాదించుకోవద్దా అంటూ భక్తులతో వాగ్వివాదానికి దిగుచున్నారు. భక్తులకు మద్దత్తుగా ఎవరైనా వస్తే ఎలా అని అడిగితే వాళ్ళకేమైనా కొమ్ములున్నాయా, వాళ్ళు మనుషులు కారా అంటూ సమాధానం ఇచ్చారు. అంతే కాకుండా వేటను నరకడంలో కూడా తమదైన శైలి చూపిస్తున్నారు. పొట్టేలును నరకాలంటే తలనరికే వాళ్ళకు వంద ఇస్తే తల దగ్గరకు నరుకుతాడు, వంద ఇవ్వక పోతే ముందరి కాళ్ళ వద్దకు నరుకుతాడు, అంతే కాకుండా కోడిని కోయాలంటే పది, ఇరవై సమర్పించుకోవాల్సిందే, ఈ విధముగా భక్తులను నిలువు దోపిడి చేస్తుంటే, చిన్నభోగం, పెద్దభోగం టికెట్ల వ్యవహారం లో ఈమద్య ఆరు మంది సిబ్బంది పై వేటుపడి విచారణ జరుగుతుంది, అంతే కాకుండా గతం లో బలిపీఠం వద్దనే ఒక దేశరక్షకుడైన జవాన్ పై చిన్నభోగం, పెద్దభోగం విషయమై దాడిజరిగిన సంఘటన కూడా జరిగినది, ఇన్ని జరుగు తున్ననూ దేవాదాయ శాఖ అధికారులు పట్టించుకున్న ధాఖలా లేదు. ఈ విషయం పైన కార్యనిర్వాహణ అధికారిని వివరణ అడుగగా అతను గతం లో అమ్మవారి బలిపీఠం వద్ద ధరల పట్టిక ఉంచడం జరిగింది.ఇవన్నీ మా దృష్టికి వచ్చిందని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళామని, వారి నుండి ఉత్తర్వులు వచ్చిన వెంటనే తగు చర్యలు తీసుకుంటామని, ప్రస్తుతం పాలక మండలి ఏర్పాటుకు దేవాదాయ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది, పాలక మండలి సభ్యులు నియామకం కొరకు అధికారులు సన్నాహాలు సిద్దం చేస్తున్నారని ఈఓ ఏకాబంరం తెలియజేశారు.
Admin
Famous TV