Monday, 27 July 2026 07:49:33 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

వైకాపా సంస్థాగత పక్రియను పటిష్టం చేద్దాం - వజ్ర భాస్కర్

Date : 07 September 2025 07:40 PM Views : 654

Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : మండలం లోని బైసాని కళ్యాణ మండపం లో వైకాపా సంస్థాగత పక్రియ కార్యాక్రమం వైకాపా మండలాధ్యక్షులు నాగభూషణ రెడ్డి అధ్యక్షతన జరిగింది. వైయస్ కాంగ్రెస్ పార్టీని గ్రామీణ ప్రాంతాల్లో మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుందామని ముఖ్య అతిథిగా పాల్గొన్న వజ్ర భాస్కర్ రెడ్డి ప్రసంగిస్తూ ప్రతి గ్రామంలోనూ వైకాపా కు ప్రాతినిధ్యం వహించేలా నియమించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. యువకుల నుంచి రైతుల వరకు ప్రతి ఒక్కరిని కమిటీలో భాగస్వాములుగా చేసి వారి ద్వారా రాబోయే కాలంలో వైకాపా ఎలాంటి ఎన్నికలకు వెళ్లిన అత్యధిక మెజార్టీతో గెలిపించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు ఈ మేరకు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ల ఆదేశాలు ఉన్నాయన్నారు.దీంతో రాష్ట్రంలోనే పుంగునూరును ఆదర్శవంతంగా తీసుకోవాలనే ఉద్దేశం వైకాపా అధిష్టానం భావిస్తుందన్నారు.ప్రతి ఒక్కరూ అకుంఠిత దీక్షతో పనిచేసి వైకాపాకు ఎదురుగా నిలచే ఏ పార్టీకైనా డిపాజిట్లు గల్లంతు అయ్యేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు ముఖ్యంగా రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు గల్లంతయ్యేలా చూడాలని కనీసం డిపాజిట్లు కూడా రాకుండా చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు అన్ని విధాల పార్టీ విధివిధానాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలన్నారు. గతంలో పనిచేసిన వాలంటీర్లు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాధింపబడిన అందరిని కమిటీల్లోకి చేర్చుకొని అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలన్నారు. అందరం కలిసి సోషియల్ వింగ్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాలు చేరవేసుకుంటూ పార్టీని మరింత పటిష్టం చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరు బాధ్యతగా పనిచేసి వైకాపాను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం పార్టీ విధి విధానాలపై చర్చించారు ఈ కార్యక్రమంలో వైకాపా రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి,జిల్లా ఉపాధ్యక్షుడు, జడ్పీటీసీ దామోదర్ రాజు,ఉపాధ్యక్షుడు జంగాలపల్లి వెంకట్రమణ, రాష్ట్ర వైకాపా నాయకులు మిద్దింటి కిషోర్ కళ్యాణ్ భరత్, చౌడేపల్లి మండల ఇన్చార్జి చంగారెడ్డి, మండల ఉపాధ్యక్షులు నరసింహులు యాదవ్, సుధాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీలు,కూరపర్తి అంజిబాబు, రుక్మిణమ్మ, వెంకటరెడ్డి,వైకాపా నియోజక వర్గ అధ్యక్షురాలు అనుప్రియ,భాస్కర,హరీష్ రాయల్,పవన్ రాయల్, సుబ్రమణ్యం రాజు, మాజీ సింగిల్ విండో చైర్మన్ రవి చంద్రారెడ్డి, షంషీర్ భాష, శ్రీరాములు, రాంబాణం శ్రీనివాసులు, అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :