Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : చిత్తూరు జిల్లా, చౌడేపల్లి మండలం లోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం కార్యాలయం లో డి. సి. ఓ ఆదేశాల మేరకు గురువారం సమాచార హక్కు చట్టం 2005 పైన అవగాహనా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పౌరసమాచార అధికారి విధులు, సమాచారం ఏయే విధముగా అడగవచ్చు, పౌరసమాచార అధికారి, సదరు ధరఖాస్తుకు ఏవిధంగా సమాధానం ఇవ్వాలి, సమాచారం ఏవిధమైన రూపం లో ఇవ్వాలని, అలాగే అందులో గల 6(1) ప్రకారం ధరఖాస్తు ధరఖాస్తుదారుడు చేస్తాడని, అలాగే సుమారు ఇరవై సంవత్సరాల సమాచారం ఇవ్వవచ్చునని, అలాగే తమ కార్యాలయానిది కాకపోయే 6(3) ప్రకారం సంబఃదిత కార్యాలయానికి మార్పిడి చేసి, దరఖాస్తు దారుడికి ఎండార్స్ మెంట్ ఇవ్వాలని, అలాగే వ్యక్తిగత వివరాలు అడిగినట్లైతే 8(1) ప్రకారం తిరష్కరించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమం లో ఉపవిభాగ సహాకార శాఖ అధికారి ఆనంద్, మురళీ మోహన్, జూనియర్ ఇన్పెక్టర్ మునిరాజ,చిన్నరెడ్డెప్ప, సి. ఈ. ఓ, సోమల పి. ఏ. సి. యస్, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
Admin
Famous TV