Famous TV - ఆంధ్రప్రదేశ్ / : శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల నందు వైద్య అధ్యాపకులకు నిరంతర వైద్య వైద్య లో భాగంగా 'బేసిక్ కోర్స్ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్ ' దిగ్విజయంగా ముగిసిన మూడు రోజుల శిక్షణా కార్యక్రమం. ఎస్వీ వైద్య కళాశాల, మెడికల్ ఎడ్యుకేషన్ విభాగం, మరియు తమిళనాడు సీ.ఎం.సీ వేలూరు వైద్య కళాశాల వారి ఆధ్వర్యంలో 9 వ తేది నుండి 11 వ తారీకు జనవరి 2024, వరకు నిర్వహించబడినది. ఈ శిక్షణా కార్యక్రమంలో 30 మంది వైద్య అధ్యాపకులకు వైద్య విద్య భోధనలో నూతన పద్ధతుల గురించి పూర్తి శిక్షణ తరగతులను మూడు రోజులు దిగజంగా నిర్వహించారు. ఈ మూడు రోజుల ముగింపు కార్యక్రమంను అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపాల్ డా, పిఏ. చంద్ర శేఖరన్ మాట్లాడుతూ, ఈ శిక్షణా తరగతులు గురించి వైద్య అధ్యాపకులకు నేషనల్ మెడికల్ కమిషన్ వారి ఆదేశాల మేరకు , డాక్టర్ వైయస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వారి సూచనలతో, వైద్య విద్య బోధనలో తీసుకోవలసిన జాగ్రత్తలు మెలకువలు గురించి వారికి, ఈ నూతన వైద్య విద్య బోధనా పద్ధతులు గురించి విద్యార్థులకు మరియు అధ్యాపకులకు ఉపయోగకరంగా ఉంటుందని, ఈ మూడు రోజులు అందరూ బాగా శిక్షణ నిపుణుల ద్వారా అన్ని మెలకువలను అడిగి తెలుసుకున్నారు అని తెలిపారు . ఈ కార్యక్రమం లో చిన్నపిల్లల విభాగాధిపతి డాక్టర్ మనోహర్ మాట్లాడుతూ ఈ శిక్షణ తరగతులు వలన క్లినికల్ నాన్ క్లినికల్ విభాగాల్లో వైద్య విద్యను అభ్యసిస్తున్న వైద్య విద్యార్థులకు అధునాతన పద్ధతుల్లో పేదవారికి వైద్యం ఎలా అందించాలో అనే అంశం మీద చర్చించడం, టెక్నికల్ శిక్షణ,శిక్షణ నిపుణుల ద్వారా తెలుసుకోవడం జరిగిందని తెలిపారు. దీనివలన పేద రోగులకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించడంలో మెలకువలను తెలుసుకోవచ్చని తెలిపారు. అదేవిధంగా యూజీ, పిజీ వైద్య విద్యార్థులకు వైద్య విద్య ను అందించేటప్పుడు వారికి ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు వలన మెరుగైన వైద్య విద్యను అందించవచ్చునని అని అన్నారు. అకాడమిక్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ కిరీటి, మాట్లాడుతూ సిఎంసి వేలూరు నుండి విచ్చేసిన డాక్టర్ ప్రకాష్, నేషనల్ మెడికల్ కమిషన్, న్యూఢిలి కోఆర్డినేటర్ ఆధ్వర్యంలో నిర్వహించామని అన్నారు. ఈ శిక్షణ శిబిరంలో చాలా సందేహాలను అడిగి నిర్వర్తించుకున్నారని తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమంలో డాక్టర్ సునీత వైస్ ప్రిన్సిపాల్, (అకాడమిక్) , వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటేశ్వర్లు (అడ్మిన్ ), డాక్టర్ మాధవి లత బయో కెమిస్ట్రీ విభాగాధిపతి, డా. డి.సత్యనారాయణ మూర్తి, వైస్ ప్రిన్సిపాల్ రీసెర్చ్, డాక్టర్ స్రవంతి, డాక్టర్ ఉమాదేవి, డాక్టర్ హరిబాబు, డాక్టర్ పాహీం, మధు , వైద్యులు వైద్య అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
Admin
Famous TV