Monday, 27 July 2026 11:03:29 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

సుప్రీంకోర్టులో ఎంపీ అవినాష్ రెడ్డికి ఊరట.. ఈ నెల 25న తేలిపోతుందా!

Ys Avinash Reddy

Date : 23 May 2023 04:27 PM Views : 684

Famous TV - ఆంధ్రప్రదేశ్ / వై ఎస్ ఆర్ ( కడప ) : సుప్రీం కోర్టులో ఎంపీ అవినాష్ రెడ్డికి స్వల్ప ఊరట లభించింది. ఆయన తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 25నకడప ఎంపీ అవినాష్ రెడ్డి ముంందస్తు బెయిల్ పిటిషన్‌‌పై సుప్రీంకోర్టులో జస్టిస్ జె కే మహేశ్వరి, జస్టిస్ పి. నరసింహ ధర్మాసనం విచారణ జరిపింది. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ చేయాలని ఆదేశించింది. ఈ నెల 25న విచారణ జరపాలని తెలంగాణ హైకోర్టుకు సూచించింది. తన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ కోరే హక్కు పిటిషనర్‌కు ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. అవినాష్ రెడ్డి తన పిటిషన్‌లో ముందస్తు బెయిల్‌పై హైకోర్టు విచారణ జరిపే వరకు కస్టడీ నుంచి రక్షణ కల్పించాలని కోరారు. లేదంటే, ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ జరిపి పరిష్కరించే వరకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని పిటిషన్‌లో అభ్యర్థించారు. అంతకముందు అవినాష్ రెడ్డి తరఫు లాయర్ వాదనలు వినిపించారు. సీబీఐ విచారణకు ఇప్పటికే ఏడు సార్లు హాజరైన విషయాన్ని కోర్టుకు వివరించారు. ఎంపీ విచారణకు సహకరించారని.. ఈ కేసులో ఆయన నిందితుడిని కాదన్నారు. ఇప్పటికే అవినాష్ రెడ్డి తండ్రి అరెస్ట్ అయ్యారని.. ఎంపీ తల్లి అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న విషయాన్ని కోర్టుకు తెలిపారు. వైఎస్ సునీతా రెడ్డి లాయర్లు కోర్టులో వాదనలు వినిపించే ప్రయత్నం చేయగా.. సుప్రీం కోర్టు నిరాకరించింది. తాము కేసు మెరిట్స్‌లోపలికి వెళ్లడం లేదని వ్యాఖ్యానించింది. ఏదైనా చెప్పదలుచుకుంటే ఉంటే హైకోర్టు ముందుకెళ్లాలని సూచించింది.

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు (Ys Vivekananda Reddy Murder Case)లో నాలుగు రోజులుగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నెల 19న విచారణకు రావాలని వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసింది. దీంతో ఎంపీ విచారణకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కానీ చివరి నిమిషంలో ఎంపీ తల్లి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలియడంతో హుటాహుటిన హైదరాబాద్ నుంచి పులివెందుల బయల్దేరి వెళ్లారు. అవినాష్ రెడ్డి తల్లిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించే ప్రయత్నం చేయగా.. ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో కర్నూలు విశ్వభారతి ఆస్పత్రికి తరలించారు. అవినాష్ రెడ్డి కూడా అక్కడే ఉండి చూసుకుంటున్నారు. ఈ క్రమంలో సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది.. ఈ నెల 21న విచారణకు రావాలని పేర్కొంది. కానీ తన తల్లి అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నారని.. తాను బాగోగులన్నీ చూసుకోవాలని సీబీఐకి అవినాష్ రెడ్డి లేఖ రాశారు. తనకు మరో వారం పాటూ గడువు ఇవ్వాలని కోరారు. ఈలోపు సుప్రీం కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు.మరోవైపు కర్నూలులో సోమవారం ఉదయం నుంచి నాటకీయ పరిణామాలు కనిపించాయి. సీబీఐ అధికారుల టీమ్ కర్నూలు వెళ్లడం.. ఎస్పీతో భేటీ కావడంతో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారనే ఊహాగానాలు వినిపించాయి. వైఎస్సార్‌సీపీ శ్రేణులు విశ్వభారతి ఆస్పత్రి దగ్గర భారీగా మోహరించారు.. పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రం వరకు టెన్షన్ వాతావరణం కనిపించింది. అక్కడ ముందస్తు జాగ్రత్తగా పోలీసు బందోబస్తు కొనసాగుతోంది.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: