Famous TV - ఆంధ్రప్రదేశ్ / : మంగళవారము ఎస్వీ వైద్య కళాశాల ప్రసూతి విభాగము నందు వైద్య అధ్యాపకులకు రెండు రోజుల నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు దిగ్విజయంగా ముగిసినవి. ఈ కార్యక్రమలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ పొందడానికి కడప గవర్నమెంట్ వైద్య కళాశాల, నెల్లూరు ఏసిఎస్ఆర్సి వైద్య కళాశాల, కుప్పం పిఎస్ వైద్య కళాశాల తిరుపతి ఎస్ వి వైద్య కళాశాల మరియు కర్నూల్ వైద్య కళాశాల లో పని చేస్తున్న వివిధ విభాగములందు నిపుణులైన వైద్యుల కొరకు వైద్యంలో, వైద్య విద్య నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల వలన మెరుగైన వైద్యం అందించడానికి , మెరుగైన వైద్య విద్యను బోధించడానికి శిక్షణా కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని , నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు ఎస్ వి వైద్య కళాశాల అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖరన్ తెలిపారు. ఈ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం వలన పేదలకు అధునాతన వైద్యం అందించడానికి ఈ శిక్షణ శిబిరం ఉన్న మాడ్యూల్స్ తో శిక్షణ ఎలా తీసుకోవాలి సిమిలేషన్, బెస్ట్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంతో నైపుణ్యత ఎలా నేర్చుకోవాలి అనే అంశం మీద పాండిచ్చేరి ఆరు బడే వీడు వైద్య కళాశాల నుంచి వచ్చిన ప్రొఫెసర్ డాక్టర్ మహాలక్ష్మి, నైపుణ్యాభివృద్ధి మీద శిక్షణ కార్యక్రమాన్ని 40 మంది వైద్య అధ్యాపకులకు దిగ్విజయంగా రెండు రోజులు పలు అంశముల మీద శిక్షణలు ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో శిక్షణ పొందిన వైద్య అధ్యాపకులు మాట్లాడుతూ ఈ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం వలన పేద రోగులకు మెరుగైన వైద్యం అందించవచ్చునని త్వరగా రోగి కోలుకోవడానికి, వైద్య విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి, నైపుణ్యా శిక్షణ ఇవ్వడానికి వచ్చిన డాక్టర్లు మాకు ఎంతో విలువైన సమాచారాన్ని ఇవ్వడం జరిగినది అని అన్నారు. ఈ కార్యక్రమం లో మెడికల్ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ డాక్టర్ కిరీటి, ప్రసూతి వైద్యశాల సూపరిటెండెంట్ డాక్టర్ పార్థసారధి రెడ్డి, ఎస్వీ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ (అకాడమిక్) డాక్టర్ సునీత, వైస్ ప్రిన్సిపల్ (అడ్మిన్ )డాక్టర్ వెంకటేశ్వర్లు, నైపుణ్య అభివృద్ధి శిక్షణ ఇవ్వడానికి వచ్చిన వివిధ కళాశాలల వైద్యులు డాక్టర్ ఫ్రాన్సిస్, డాక్టర్ విజయ్ ఆనంద్, డాక్టర్ అరుణ్, డాక్టర్ రాజ్ కుమార్, ప్రసూతి వైద్యశాల విభాగ అధిపతి డాక్టర్ ప్రమీల దేవి , డాక్టర్ ఆర్ ఉమాదేవి, డాక్టర్ స్రవంతి , వైద్యులు, పీజీ వైద్య విద్యార్థులు, మరియు ఎస్ వి వైద్య కళాశాల పి.ఆర్.ఓ వీర కిరణ్ పాల్గొన్నారు.
Admin
Famous TV