Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : చిత్తూరు జిల్లా, చౌడేపల్లి మండలం లోని ప్రముఖ పుణ్యక్షేత్రం బోయకొండ గంగమ్మ దేవస్థానం పాలకమండల సభ్యులుగా ధరఖాస్తులు కోరడంతో దేవాదాయ, దర్మాదాయ శాఖ వారు ప్రముఖ దేవస్థానాల పాలక మండళ్ళు ఏర్పాటుకు నోటిఫికేషన్ ఇచ్చారు.నోటిఫికేషన్ ఇచ్చిన ఇరవై రోజులలో పాలక మండలి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.దేవస్థానం వార్షిక ఆదాయాన్ని అనుసరించి పాలక మండలి సభ్యులు ఏర్పాటు చేస్తున్నారు. బోయకొండ గంగమ్మ దేవస్థానం కు 13 సభ్యులు నియమించడం జరుగుతుంది.బోయకొండ గంగమ్మ దేవస్థానం సభ్యులుగా చౌడేపల్లి మండలం, శెట్టిపేట గ్రామపంచాయతీ కి చెందిన ఎర్రగాని పల్లికి చెందిన ప్రముఖ సేవారత్నా, పారిశ్రామిక వేత్త, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాదిరాజు లక్ష్మణరాజు (పతిరాజు)ధరఖాస్తు చేశారు.ఈయనతో పాటుగా చౌడేపల్లి మండలానికి చెందిన భారతీయ జనతా పార్టీ మండలాధ్యక్షులు కడియాల మనోహర్ కూడా ధరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్బంగా కార్యనిర్వాహణాధికారి మరియు ఉప కమీషనర్ ఏకాంబరం మాట్లాడుతూ పాలక మండలి కొరకు మొత్తం ఎనిమిది ధరఖాస్తులు వచ్చాయని, ఆయన తెల్పారు
Admin
Famous TV