Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు,బోయకొండ ఆలయ మాజీ చైర్మన్,మాజీ జడ్పిటీసి సభ్యులు దివంగత గువ్వల రామకృష్ణారెడ్డి ఐదవ వర్ధంతి సందర్భంగా ఆయన స్వగ్రామం తెల్లనీళ్ళ పల్లిలో ఆయన కుటుంబ సభ్యులు ఆయన సమాధి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు, అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఆయన చిత్రపటానికి చౌడెపల్లి బస్టాండ్ వద్ద తెలుగు దేశం పార్టీ యువనాయకులు కార్తీక్,పుంగనూరు నియోజక వర్గ తెలుగు యువత ఉపాద్యక్షులు నాగరాజ రెడ్డి, అనూస్ రాయల్,అర్జున్, మని సింగ్, ఆవుల పవన్ కుమార్, పార్టీ కార్యకర్తలు పూలమాల వేసి నివాళులు అర్పించారు.గువ్వల రామకృష్ణారెడ్డి గతం నుంచి తెలుగుదేశం పార్టీతో అనుబంధాన్ని కొనసాగించి, పార్టీ ఆవిర్భావం నుంచి తన తుది శ్వాస విడిచేంతవరకు పార్టీకి ఆయన చేసిన సేవలను కొనియాడారు.ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడూ నిబద్ధతతో పని చేసిన ఆయన ప్రజల హృదయాలలో నిలిచిపోయారు.ఈ సందర్భంగా బస్టాండ్ వద్ద రెండుచోట్ల అన్నదాన కార్యక్రమఝ ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమంలో గడ్డంవారిపల్లి మాజీ సర్పంచ్ వెంకటరమణ,పంజాణి పల్లి బాబు నాయుడు, విజయ భాస్కర్ రెడ్డి, పృద్వి, మునివెంకటప్ప,కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
Famous TV