Famous TV - క్రైమ్ వార్తలు / చిత్తూరు : పీలేరు నియోజకవర్గం కలకడ మండలం కదిరే చెరువు పంచాయతీ వడ్డిపల్లి వద్ద ఓ వ్యక్తి ని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఉసిరికాయల రామచంద్ర S/o. సిద్ధ లింగం (45) అనబడే వ్యక్తిని రాత్రి ఒంటిగంట ప్రాంతంలో పొలం వద్ద నిద్రిస్తున్న సమయంలో అగంతకులు తలపై కొడవలితో నరికి చంపడంతో రామచంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. పశువుల వ్యాపారం చేస్తూ జీవనం సాగించే రామచంద్ర జైలు జీవితం అనుభవించి రావడంతో పాత కక్షలే కారణమా తెలియ రావాల్సి ఉంది. సంఘటనపై కలకడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Admin
Famous TV