Monday, 27 July 2026 08:55:59 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

దళిత జర్నలిస్టుపై దాడి - తీవ్రంగా ఖండించిన సీనియర్ జర్నలిస్టు టి.మునిరత్నం

Date : 13 March 2026 07:44 PM Views : 674

Famous TV - క్రైమ్ వార్తలు / చిత్తూరు : నిందితులపై అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలి భూ కబ్జాలపై వార్తలు రాసినందుకు దళిత జర్నలిస్టుపై దాడి చేయడం ప్రభుత్వ అపరాధమని,ఘటనను సీనియర్ జర్నలిస్టు పలమనేరు టి.మునిరత్నం తీవ్రంగా ఖండించారు. దినపత్రిక సూర్య జర్నలిస్టు ఉమాపతి పై అలాగే వీడియో జర్నలిస్టులపై దాడి ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి నని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో తిరుపతి రూరల్ మండలం పేరూరు ప్రాంతంలో భూ కబ్జాల వ్యవహారంపై సమాచారం సేకరించేందుకు వెళ్లిన జర్నలిస్టులపై కొందరు రౌడీ షీటర్లు మూకుమ్మడిగా దాడికి పాల్పడి తీవ్రంగా గాయ పరిచడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టులపై దాడి చేయడమే కాకుండా వారి కెమెరాలను ధ్వంసం చేసి, దూషించడం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు.ప్రధానంగా జర్నలిస్టుల భద్రతకు ప్రభుత్వం మరియు పోలీసు శాఖ తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేసారు. ఈ ఘటనకు పాల్పడిన పేరూరు ప్రాంతానికి చెందిన రౌడీ షీటర్లపై పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా దళిత జర్నలిస్టుపై దాడిచేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం 'కింద కేసు నమోదు చేసి నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని ఆయన కోరారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, జర్నలిస్టులపై దాడి చేసే వారిపై ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉపేక్షింపకూడదని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర ఎంతో ముఖ్యమని, మీడియా స్వేచ్ఛను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. అధికారులు వెంటనే స్పందించి రౌడీషీటర్ల పై కేసులు నమోదు చేసి జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. ఆయనతోపాటు సమాచార హక్కు చట్టం పరిరక్షణ సమితి సభ్యులు జిల్లా రాష్ట్ర నాయకులు జాతీయ నాయకులు ఉత్తరాది హరిప్రసాద్, గిరిబాబు, శివకుమార్, సుబ్రహ్మణ్యం, గజేంద్ర, హేమంత్, గుణశేఖర్, పలువు జర్నలిస్టులో డిమాండ్ చేశారు

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :